క్రైమ్/లీగల్

నవ వరుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, సెప్టెంబర్ 17:మండల పరిధిలోని గూటుపల్లెలో సోమవారం కాళ్ల పారాణి కూడా ఆరని నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాలు.. గ్రామానికి చెందిన బాలమ్మ, అంజనమ్మ దంపతుల చివరి కుమారుడైన మిన్నల్లగారి నాగేశ్వరరావు(25)కు అదే గ్రామానికి చెందిన సావిత్రమ్మతో ఈ నెల 2వ తేదీ వివాహం చేశారు. అయితే సోమవారం నాగేశ్వరరావు పంట పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి భార్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుపాలు సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను విచారించగా నాగేశ్వరరావు చాలాకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడని అయినా జబ్బు నయం కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలిసిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.