క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో బిహారీ వాసీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, సెప్టెంబర్ 17: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం ముండ్రాయి గ్రామ శివారులో హస్నాబాద్- సిద్దిపేట రహదారిపై సోమవారం నాడు జరిగింది. రాజగోపాల్‌పేట పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం కుకుజారీ గ్రామానికి చెందిన బలిస్టార్ కుమార్ యాదవ్ (32) గత కొన్ని రోజుల క్రితం ముండ్రాయి శివారులోని సురభి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం పాలకోసం ముండ్రాయి గ్రామానికి వచ్చి తిరిగి టీఎస్‌ఇ 36 బీటీఆర్ 0777 ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో శ్రీనివాస్ పారాబాయిల్డ్ వద్ద వెనుక నుండి హుస్నాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్తున్న ఎపీ 36, ఎటీ 4848 నెంబర్‌గల కారు ఢీ కొట్టినట్లు తెలిపారు. దీంతో కుమార్ యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అతనిని వెంటనే ఢీ కొట్టిన వారు వెంటనే సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కుమార్ యాదవ్ మృతి చెందినట్లు తెలిపారు. రాజగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆధునిక టెక్నాలజీతో గణేశ్ మండపాలకు భద్రత: సీపీ
సిద్దిపేట, సెప్టెంబర్ 17 : ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సహాయంతో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మండపాల భద్రతను పర్యవేక్షించనున్నట్లు సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 2803 వినాయక మండపాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినాయక మండపాలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించినట్లు చెప్పారు. సిద్దిపేట డివిజన్‌లో 1244, గజ్వేల్‌లో 914, హుస్నాబాద్ డివిజన్‌లో 643 వినాయక మండపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణపతి విగ్రహాలకు జియోట్యాగింగ్ ద్వారా గూగుల్ మ్యాప్‌లను అనుసందానం చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ సిబ్బంది, బ్లూ కోల్ట్స్ సిబ్బంది పూర్తి సమాచారాన్ని ట్యాబుల్లో నిక్షిప్తం చేసినట్లు పేర్కొన్నారు.