క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు కాడెద్దు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, సెప్టెంబర్ 17: షాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని చర్లగూడ గ్రామానికి చెందిన రైతు పార్వతి జంగయ్య కాడెద్దుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వర్షాకాలంలో వ్యవసాయనికి నిరంతరం కూలీ పని చేసుకొని జీవించే మాకు దేవుడు అన్యాయం చేశాడని బోరువిలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యం

మేడ్చల్, సెప్టెంబర్ 17: మేడ్చల్ పీఎస్ పరిధిలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యమయ్యారు. వివరాల ప్రకారం ఇంట్లో పనిచేయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైంది. పట్టణంలోని కిందిబస్తీలో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మీ (18) ఎన్జీఓ కాలనీలోని ఓ ఇంటిలో పనిచేయడానికి అదివారం సాయంత్రం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా ములుగు మండలం బస్వాపూర్ గ్రామంలో పనిచేస్తున్న వృద్ధురాలు రత్నమయి (60) ఆదివారం మేడ్చల్ పట్టణానికి సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చి అదృశ్యమైంది. మండలంలోని పూడూరు గ్రామానికి చెందిన బక్క శ్రీనివాస్ (26) ఈ నెల 14వ తేదీన మునీరాబాద్ గ్రామంలో పెయింటింగ్ పనికోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.