క్రైమ్/లీగల్

వినాయక నిజమ్జనంలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, సెప్టెంబర్ 24: వినాయక ఉత్సవాల్లో భాగంగా 11రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని గోదావరిలో నిమజ్జనం చేసేందుకు అత్యంత భక్తిశ్రద్దలతో శోభాయాత్ర నిర్వహించగా, జనరేటర్‌తో ఏర్పడిన విద్యుదాఘాతంతో మృత్యు ఒడిలోకి చేరిన సంఘటన నవీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నవీపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్-1కు చెందిన వివేక్(18) అనే యువకుడు, తన స్నేహితులతో కలిసి వినాయక విగ్రహాన్ని బాసర గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ఆదివారం రాత్రి బయలుదేరాడు. సోమవారం ఉదయం నవీపేట మండల కేంద్రానికి సమీపంలోని అయ్యప్ప ఆలయానికి చేరుకోగానే ఫిట్స్ వచ్చినట్లు పడిపోవడంతో గమనించిన స్నేహితులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని ఎస్‌ఐ తెలిపారు. వినాయక నిమజ్జనం కోసం నిజామాబాద్‌కు వచ్చిన వివేక్ మృత్యువాత పడటంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి ఉమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

విద్యుత్ ఉద్యోగి ఆత్మహత్య

నిజామాబాద్, సెప్టెంబర్ 24: జిల్లా కేంద్రంలోని గౌతంనగర్ ప్రాంతానికి చెందిన నగేష్(50) అనే విద్యుత్ శాఖ ఉద్యోగి సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత రెండు మాసాల క్రితం చేతికందివచ్చిన ఇద్దరు కుమారులను పాతకక్షల నేపథ్యంలో ఫ్యాక్షన్ దాడులను మరిపించే విధంగా ప్రత్యర్థులు నరికి చంపారు. అప్పటి నుండి తీవ్ర మానసిక ఆందోళనతో కాలం వెళ్లదీసిన నగేష్ తాను కూడా బలవన్మరణాన్ని ఎంచుకుని అర్ధాంతరంగా తనువు చాలించాడు. గత జూలై 21వ తేదీన రైల్వే స్టేషన్ వెనుక భాగంలోని మైదానం ప్రాంతంలో మృతుడి ఇద్దరు కుమారులైన పవన్‌కల్యాణ్ యాదవ్(22), నర్సింగ్ యాదవ్(24)లను ప్రత్యర్థులు వ్యూహం ప్రకారం అక్కడికి పిలిపించుకుని, క్రికెట్ బ్యాట్‌లతో బాది, పదునైన కత్తులు, తల్వార్‌లతో నరికి చంపారు. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు సమగ్ర దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో మృతుల తండ్రి అయిన నగేష్ సోమవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి అనంతరం అతని గదిలోకి వెళ్లి చూసిన మృతుడి భార్యకు నగేష్ శవమై వేలాడుతూ కనిపించాడు. బాధిత కుటుంబీకులు అందించిన సమాచారం మేరకు త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా జరిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.