క్రైమ్/లీగల్

సాగర్ కాలువలో గల్లంతైన పోలీస్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారంపూడి, సెప్టెంబర్ 24 : స్నేహితుడిని కాపాడటానికి వెళ్లి నాగార్జునసాగర్ కుడికాలువలో ఆదివారం గల్లంతైన కారంపూడి పోలీస్ కానిస్టేబుల్ పత్తిపాటి ఆనంద్‌కుమార్ (30) మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. గత 32 గంటల నుండి కారంపూడి సాగర్ కాలువ వద్ద నుండి ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈత గాళ్లు బృందాలుగా విడిపోయి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నకరికల్లు లాకులు, ఈపూరు మండలం అగ్నిగుండాల లాకుల వరకు ఎన్ ఆర్‌డి ఎఫ్ సిబ్బంది గాలింపులో భాగంగా అగ్నిగుండాల లాకుల వద్ద ఇరుక్కుపోయి కళేభరాల మధ్య ఆనంద్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. ఎస్సై మనె్నం మురళి సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ 2012లో పోలీస్‌శాఖలో చేరారు. 2016 వరకు రేపల్లె, పిడుగురాళ్ల తదితర పోలీస్ స్టేషన్‌లలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి బదిలీపై కారంపూడి వచ్చారు. మృతదేహాన్ని ఈపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని తన స్వగ్రామమైన ఉన్నవ గ్రామానికి తరలించారు. ఆనంద్‌కుమార్ మృతితో భార్య సబిత, కుటుంబ సభ్యులు భోరున రోదించారు. అతని మృతిపట్ల పోలీసులు సంతాపాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.