క్రైమ్ కథ

సైకో కిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కేబిన్ బయట తడిగా, చలిగా, చీకటిగా ఉంది. చేతిలో చేటతో బయటకి వచ్చిన పదిహేనేళ్ల శాలీ మణికట్టు చుట్టూ అతని వెచ్చని వేళ్లు బిగుసుకున్నాయి.
‘్భయపడక. నినే్నం చేయను. లోపలకి వెళ్దాం పద. మనిద్దరం ఇక్కడే ఉంటే మంచుకి టార్గెట్స్ అవుతాం’ చెప్పాడు.
‘నేను చెత్తని పారబోయాలని బయటకి వచ్చాను’ శాలీ చెప్పింది.
‘ఐతే పారబోయి. పక్కనే చెరువు ఉండడం వల్ల ఇక్కడ చల్లగా ఉంటుంది.’
అతను మాట్లాడుతూనే చుట్టూ చూడసాగాడు. సియర్రా ద్వీపంలోని రాళ్లన్నీ మంచుతో కప్పబడి వెనె్నల్లో నిగనిగ మెరుస్తున్నాయి.
‘చెరువు మీది మంచు బద్దలవగానే మా నాన్న రెనో నించి వచ్చేస్తారు’ చెప్పాక తనా మాటని చెప్పకుండా ఉంటే బావుండేదని ఆమెకి అనిపించింది. తను ఒంటరి అని చెప్పినట్లైంది.
ఇద్దరూ ఒకే గది కల ఆ కేబిన్‌లోకి వెళ్లారు. లోపల వెచ్చగా ఉంది. ఫైర్ ప్లేస్‌లో నిప్పు మండుతోంది. బల్ల మీద ఓ పెట్టె మార్ష్‌మెలోస్, పక్కన స్కూవర్ ఉన్నాయి. గినె్నలు తోమాక శాలీ మార్ష్‌మెలోస్‌ని రోస్ట్ చేయాలని అనుకుంది. అతని వంక చూసింది. ముప్పై ఐదేళ్ల అతన సన్నగా, మొరటుగా ఉన్నాడు. దుర్మార్గుడిలా కనిపించడం లేదు అనుకుంది. అతను అరచేతులని నిప్పు మీద ఉంచి వెచ్చ చేసుకుంటూ ఆమె వంక చూసి నవ్వాడు.
‘నా పేరు గ్రెగ్. నేను కౌంటీ షెరీఫ్ దగ్గర పని చేస్తున్నాను. నేను డిసోరేషన్ లేక్ నించి మానసిక రోగైన ఓ కుర్రాడితో వచ్చాను. మంచు జారి మా మధ్య పడటంతో విడిపోయాం.’
దూరంగా ఎక్కడో పేలుడు వినిపించడంతో అతను అదిరిపడ్డాడు. రఅది చెరువు మీది మంచు పగిలే చప్పుడు అని తెలిసాక సిగ్గుపడ్డాడు.
‘అతను ఇటుగా వచ్చాడేమోనని ఇక్కడికి వచ్చాను.’
శాలీ తోమిన గినె్నలని తుడవడానికి ఓ బట్టని అందుకుంది.
‘మాకు తెలీకుండా ఈ ద్వీపంలోకి ఎవరూ రాలేరు. ఇది కేవలం వెయ్యి అడుగుల పొడవు మాత్రమే ఉంది’ చెప్పింది.
‘తినడానికి ఏమైనా పెడితే తిని ఉత్తర తీరంలో వాడి కోసం వెతుకుతూ వెళ్తాను’
ఆమె అతనికి మిగిలిన లేంబ్ స్ట్యూని పెట్టి చెప్పింది.
‘పడవ చెరువుకి అటు చివర ఉంది. మంచు బద్దలయ్యాక మా నాన్న దాంట్లో వస్తారు. మంచు పగులుతూండగా చెరువు మీద నడిచి రావడం ప్రమాదకరం. కింద నీళ్లల్లో పడితే పైకి రాకుండా, పైన మంచు కమ్ముకుంటుంది’ శాలీ చెప్పింది.
మళ్లీ బయట పేలుడు చప్పుడు వినగానే అతను చేతిలోని చెంచాని వదిలేశాడు. అకస్మాత్తుగా అతని చెయ్యి జేబు మీదకి వెళ్లింది. అతని ప్రవర్తన శాలీకి అర్థం కాలేదు.
‘మీరు బయటకి వెళ్లి ఆ కుర్రాడి కోసం వెదకచ్చుగా? లేదా ఈ చలికి గడ్డ కట్టుకుని చచ్చిపోతాడు’ సూచించింది.
‘నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్లలేను’
‘అతను ప్రమాదకరమైన పిచ్చివాడా?’
‘ఆ పిచ్చివాడు నిన్న స్కీయింగ్‌కి వచ్చిన ఇద్దరు ఆడవాళ్లను చంపేశాడు. డిజొరేషన్ లేక్‌కి వాళ్లకి మార్గదర్శిగా వచ్చాడు. పద్దెనిమిదేళ్లే ఐనా వాడు సైకో కిల్లర్’
అకస్మాత్తుగా తలుపు బయట దబ్బుమన్న చప్పుడు వినిపించింది. గ్రెగరీ లేచి వెళ్లి తలుపు తెరిచాడు.
బయట పడున్న కుర్రాడిని లాగి బల్ల మీద పడుకోబెట్టాడు. అలసిపోయినట్లుగా కనిపించే వాడి జాకెట్ మీద, పల్చటి చొక్కా మీద మంచు ఉంది. వాడి తల మీద, కుడి కంటి కింద గాయాలు కనిపించాయి. గ్రెగరీ అతని చెంపల మీద గట్టిగా కొట్టగానే కళ్లు తెరిచాడు. తేనె రంగులోని ఆ పెద్ద కళ్లల్లో వెలుగుంది. శాలీ వంక చూసే ఆ కళ్లు వౌనంగా తనకి ఏదో చెప్తున్నట్లుగా శాలీకి అనిపించింది.
అతను కళ్లు తెరిచి ఉంచే ప్రయత్నం చేస్తూ శాలీ ఇచ్చిన వేడి కాఫీ తాగాడు. గ్రెగరీ గురించి చెప్తున్నాడని శాలీకి, అతని చూపు గ్రెగరీ మీదకి, మళ్లీ తన వైపు, తిరిగి అతని మీదకి రెండు మూడుసార్లు మర్లడంతో అనిపించింది. అతను చివరికి భయంగా చెప్పాడు.
‘నాకు నువ్వు తెలుసు. నువ్వు శాలీ లైంటిస్. సియర్రా యూనియన్ హైస్కూల్లో నువ్వు చదివావు. క్రితం సంవత్సరం మా ఐస్ హాకీ టీం మీ టీంతో ఆడింది. నా పేరు రిచీ’
అతను తన చేతుల వంక చూసుకుని తల వంచుకుని మళ్లీ చెప్పాడు.
‘కాని ఇప్పుడు నేనేం కాను’
గ్రెగరీ శాలీని మోచేత్తో పొడిచి చూడమని సైగ చేశాడు. ఆమె రిచీ చేతుల వంక చూసి అవి హంతకుడి చేతులని అనిపించగానే కొద్దిగా వణికింది.
‘నేను నీళ్లల్లో తేలేదేమైనా అక్కడ ఉందేమో చూస్తాను. మీకో బోట్ హౌస్ ఉందన్నమాట. ఇతన్ని చూస్తూండు’ చెప్పి గ్రెగ్ తన జేబులోంచి రివాల్వర్ని తీసి శాలీకి ఇచ్చాడు.
గ్రెగరీ వెళ్లిన కాసేపటికి రిచీ తల ఎత్తి శాలీ వంక, ఆమె చేతిలోని రివాల్వర్ వంక చూశాడు. అలసటతో కూడిన నవ్వుని నవ్వి కళ్లు మూసుకున్నాడు.
‘నాకు జ్వరం వచ్చినట్లుంది’ కొద్దిసేపాగి కళ్లు తెరచి చెప్పాడు.
శాలీ అతని వైపు వంగి నుదుటి మీద చేతిని వేస్తే అది కాలిపోతోంది. అతను ఆమె రెండో చేతిలోని రివాల్వర్ని లాఘవంగా అందుకున్నాడు. ఆమె భయపడింది. రిచీ దాని గొట్టాన్ని వాసన చూసి, తిరిగి ఆమె చేతికి ఇచ్చి నవ్వి చెప్పాడు.
‘్భయపడక. దాన్ని ఉపయోగించే ఉద్దేశం నాకు లేదు. నేను ఎంత నీరసంగా ఉన్నానో చూశావా? ఈ నీరసపు చేతులతో ఇద్దరు ఆడవాళ్లని ఎలా హత్య చేయగలను? గ్రెగరీ ఎంత తాజాగా ఉన్నాడో చూసావుగా? అతను నన్ను చంపేస్తాడు. ఎందుకంటే అతను వాళ్లని చంపడం నేను చూసాను’
‘నిజంగా?’ శాలీ నిర్ఘాంతపోతూ అడిగింది.
‘ఆమె అతని భార్య. చేపల వేట కోసం వస్తూ డిసొరేషన్ లేక్ దాకా నన్ను మార్గదర్శిగా కుదుర్చుకున్నారు. అతను ఆమెని చంపి అది నాపనని చెప్పే పథకం వేశాడని నాకు తెలీదు. ననే్న ఎందుకు ఎన్నుకున్నాడో దేవుడికే తెలియాలి’
తలుపు ఎంత నిశ్శబ్దంగా, వేగంగా తెరచుకుందంటే గుమ్మంలో నిలబడ్డ గ్రెగరీని చూసి శాలీ భయపడింది.
‘చిన్న కేన్వాస్ పడవ కనిపించింది. అది సరిపోతుంది. దాన్ని బయటకి తోయడానికి నాకు సహాయానికి వస్తావా?’ అతను అడిగాడు.
‘కాని దాంట్లోకి నీళ్లు వస్తాయి. దానికో రంధ్రం ఉంది’
‘ఐనా ఫర్వాలేదు. బయటకి తీసాక చెక్ చేస్తాను. రా’
శాలీ ఆ ఇద్దరి వంకా చూసింది. గ్రెగ్ ప్రశాంతంగా ఉన్నాడు. రిచీ వత్తిడికి గురైనట్లుగా కనిపించాడు. ఆ ఇద్దరిలో ఎవరు చెప్పింది నమ్మాలి? తన తండ్రిలా కనిపించే గ్రెగరీ హంతకుడు కాడు అనిపించింది.
‘ఇతను?’ రిచీ వంక చూస్తూ అడిగింది.
‘ఇతని సంగతి నేను చూస్తాను’
గ్రెగరీ అతని దగ్గరికి వెళ్లి బలవంతంగా లేపాడు.
‘శాలీ! ప్లీజ్!’ రిచీ అర్థించాడు.
గ్రెగరీ చేతుల్లోంచి బయటపడాలని రిచీ అర్ధిస్తూంటే, గ్రెగరీ రెండు పసుపు పచ్చ మాత్రలు తీసి రిచీ నోట్లోకి బలవంతంగా తోశాడు.
‘కొద్దిగా నీళ్లివ్వు’
‘ఏమిటవి?’ శాలీ అతనికి నీళ్ల గ్లాసుని ఇస్తూ అడిగింది.
‘కొద్దిసేపు నిద్ర పుచ్చే మాత్రలు మాత్రమే’
రిచీని చూస్తే మళ్లీ కుర్చీలో కూలబడి నిరాశగా సహాయం కోరుతూ తన వంక చూస్తూ కనిపించాడు. అతని కళ్లు వేటాడబడే జంతువు కళ్లల్లా తోచింది. శాలీ తనకి తెలీకుండానే ప్రశ్నించింది.
‘అతను వాళ్లని ఎలా చంపాడు?’
‘రివాల్వర్ ఇవ్వు’
‘ముందు జవాబు చెప్పు’
‘గొంతు పిసికి చంపాడు. ఆమెది నీ వయసే. అతని చేతులు బలంగా ఉన్నాయి. రివాల్వర్ ఇవ్వు’
‘మీరు ఇందాక ఇద్దరు అమ్మాయిలని చంపాడని చెప్పారు కదా?’
అతను కొద్దిగా సందేహించి చెప్పాడు.
‘నువ్వు పొరబడ్డావు. ఒక్కర్నే చంపాడు. నీ వయసామెని’
‘నీ భార్యనా?’
వెంటనే అతని కళ్లు విశాలమయ్యాయి.
‘తెలివిగల దానివి కాని రివాల్వర్ ఇవ్వు ముందు. రెండో అమ్మాయి కూడా చావాలని అనుకుంటున్నావా? అలాగే. సరే’ అతను శాలీ చేతిలోని రివాల్వర్‌ని బలవంతంగా లాక్కోబోయాడు.
ఆమె తిరగబడి రివాల్వర్ పిడితో అతన్ని నెత్తి మీద బలంగా కొట్టింది. అతను వెంటనే రెండడుగులు వెనక్కి వేసి నేల కూలాడు. ఆమె రివాల్వర్ని పక్కన పెట్టి, రిచీ దగ్గరకి వెళ్లి కుదుపుతూ చెప్పింది.
‘అతను ఇక మనిద్దర్నీ ఏం చేయలేడు. నీ చేత ఆ మాత్రలు బలవంతంగా మింగించాడు’
‘లేదు. నేనా మాత్రలని మింగలేదు’
అతను ఆమెని తనవైపు లాక్కున్నాడు. అతని చేతులు ఆమె అనుకున్న దానికన్నా బలంగా ఉన్నాయి. అతని కౌగిలి వెచ్చగా, సౌకర్యంగా అనిపించింది. రిచీ చేతులు ఆమె మెడ చుట్టూ అల్లుకున్నాయి.
‘నా చేతులు అతని చేతులంత బలమైనవి కావు’
శాలీ అతన్నించి నెమ్మదిగా దూరంగా జరగసాగింది. అతని చేతులు ఆమె మెడ మీది ముడతలని మృదువుగా నిమరసాగాయి.
‘దయచేసి ఆ అమ్మాయిలా దీన్ని పాడుచేయకు. నువ్వు అందంగా ఉన్నావు. ఆ అమ్మాయికన్నా. వెనక్కి జరక్క’ రిచీ చెప్పాడు.
‘నువ్వు, గ్రెగరీ ఇద్దరూ నేరస్థులేనా?’ ఎండిపోయిన నోటితో శాలీ అడిగింది.
‘నేను, గ్రెగ్ డిప్యూటీ షెరీఫ్ ఫోల్సమ్ జైలుకి బయలుదేరాం. గ్రెగ్ సాధారణ మోసగాడు. టహోయ్‌లో అతన్ని అరెస్ట్ చేశారు. రోడ్డు మీది మలుపులో మా కారు మంచుకి జారి తిరగబడింది. స్పృహలో లేని షెరీఫ్ జేబులోని మా బేడీల తాళం చెవులు తీసుకుని వాటిని విప్పుకున్నాక గ్రెగ్, నేను కొండల్లోని ఇటువైపు వచ్చాం. మధ్యలో మేం ఇద్దరం దెబ్బలాడుకున్నాం. నాకు ఎక్కువ దెబ్బలు తగిలాయి. వాలీ.. తప్పించుకునే ప్రయత్నం చేయక. ఎక్కువగా బాధ ఉండదు.’
అతని చేతివేళ్లు ఆమె కంఠం చుట్టూ బిగుసుకోసాగాయి. ఆమె వేలి గోళ్లతో అతన్ని గిచ్చింది. అతను గొంతు పిసుకుతూ ఆమె వైపు వంగి ఆమె పెదాల మీద చుంబించాడు. అప్పుడు కూడా అతని వేళ్లు బిగుసుకోసాగాయి. ఆమె వేలాడే చేతులు టేబిల్ క్లాత్ అంచుని పట్టుకున్నాయి. ఆమె దాన్ని దగ్గరగా లాగితే గినె్నలు, మార్ష్‌మెలోస్‌ని గుచ్చడానికి ఉంచిన స్కూవర్ తగిలాయి. ఆమె చేతి వేళ్లు స్కూవర్ చుట్టూ బిగుసుకున్నాయి. దాంతో అతని పొట్టలో బలంగా గుచ్చింది. ఆమె చేతి మీద వేడి రక్తం చిందులు పడ్డాయి. నెమ్మదిగా అతని వేళ్లు ఆమె కంఠాన్ని వదిలాయి. అతను దబ్బున నేల కూలాడు. శాలీ తనకి రక్షణగా గ్రెగరీకి రివాల్వర్‌ని గురి పెట్టింది.
దూరంగా ఎక్కడో చెరువులో పేలిన శబ్దం. మంచు విరిగిన శబ్దం. మళ్లీ ఇంకోసారి. వెంటనే మరోసారి అవే శబ్దాలు వినిపించాయి. చెరువులో మంచు కరుగుతోంది. తన తండ్రి త్వరలో వస్తాడని ఆమెకి తెలుసు.
(వర్జీనియా కాఫ్‌మేన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి