క్రైమ్ కథ

రాంగ్ నంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరోల్ మూడు నెలల క్రితం న్యూయార్క్ నగరానికి ఉద్యోగం కోసం వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్‌గా చేరింది. ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ని అద్దెకి తీసుకున్న ఆమె ఫోన్ కోసం అప్లై చేసింది.
ఓ రోజు ఆఫీస్ నించి ఇంటికి వస్తున్న ఆమె ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్ బిల్డింగ్ తలుపు తెరచుకుని బయటి వచ్చి, టెలిఫోన్ కంపెనీ వేన్ దగ్గరికి వెళ్లడం చూసింది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి అడిగింది.
‘మిస్టర్. మీరు టెలీఫోన్ కంపెనీ మనిషా?’
‘అవును. మీరు కెరోల్ థామసా? ఒన్ బి ఫ్లాట్‌లో ఉంటున్నారా?’ అతను ప్రశ్నించాడు.
‘అవును. మీరు కనపడకపోతే నాకు చాలా ఇబ్బంది కలిగేది. రండి.’
ఇద్దరూ ఆమె అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు.
అతను టేబిల్ మీది కనెక్షన్ లేని టెలీఫోన్‌కి కనెక్షన్ ఇచ్చి రిసీవర్ అందుకుని ఓ నంబర్ డయల్ చేశాడు.
‘వయోలాని. చెకింగ్. నంబర్ సెస్క్యుహెన్నా 47568.. వెయిట్ చేస్తాను’ చెప్పి అతను రిసీవర్ పెట్టేశాడు.
‘కనెక్షన్‌కి ఎంత టైం పడుతుంది?’ ఆమె అడిగింది.
‘చిటికెలో. అంతే’ వయోలా చెప్పాడు.
వెంటనే ఫోన్ మోగింది. ‘చూసారా?’ అని అతను రిసీవర్ అందుకుని అవతలి వైపు కంఠం విన్నాక ఓకే’ అని రిసీవర్ పెట్టేసి లేస్తూ చెప్పాడు.
ఆమె తలుపు మూసి గడియ పెట్టి, వంట గది వైపు వెళ్తూంటే ఫోన్ మోగింది. వెంటనే రిసీవర్ని చెవి దగ్గర ఉంచుకుంది.
ఆమెకి ఓ సంభాషణ వినిపించింది.
‘లేరీ! మేరీ లూని. నాకు సహాయం చేయి’ ఓ ఆడకంఠం భయంగా, అదుర్దాగా వినిపించింది.
‘లేరీ నీకు సహాయం చేయలేడు షుగర్ బన్’ అనే మగకంఠం వినిపించింది.
‘దూరంగా వెళ్లు. నన్ను ముట్టుకోకు’ ఇంకాస్త భయంతో ఆడకంఠం అరిచింది.
తర్వాత ‘నో..నో.. నో’ అని మూడుసార్లు అరిచాక ఆమె కేక భయంకరంగా వినిపించింది. వెంటనే కనెక్షన్ కట్ అయింది. కెరోల్ తన చేతిలోని రిసీవర్ వంక అయోమయంగా చూసింది. లేరీ అనే అతనికి సహాయం కోసం వచ్చిన ఆ ఫోన్ కాల్‌లో తను విన్న ఆ సంభాషణని గురించి ఆమె కొద్దిసేపు ఆలోచించింది.
* * *
లెఫ్టినెంట్ జేసన్ దగ్గరికి సార్జంట్ పాల్ వచ్చి చెప్పాడు.
‘ఆ అమ్మాయి మిమ్మల్ని చూడాలని పట్టుబడుతోంది’
‘్ఫన్‌లో ఏదో విన్న అమ్మాయా?’ అతను అతడిగాడు.
‘అవును’
‘సరే. పంపించు’
లోపలకి వచ్చిన కెరోల్‌ని సార్జెంట్ పాల్ లెఫ్టినెంట్‌కి పరిచయం చేశాడు. అతని ముందు కూర్చుని కెరోల్ చెప్పింది.
‘కనీసం మీరు నేను చెప్పేది వినడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్. నేను అబద్ధం చెప్తున్నానని మీరు కూడా అనుకుంటున్నారా?’
‘మీరు టెలిఫోన్‌లో ఓ వాదనని విన్నారా?’
‘వాదనా? కాదు. అతను ఆమెని హత్య చేశాడు. ఆమె పేరు మేరీ లూ’
‘ఆమె పూర్తి పేరు విన్నారా?’
‘లేదు. ‘లేరీ! మేరీ లూని. సహాయం చెయ్యి’ అని అరిచింది. నేను హంతకుడి కంఠాన్ని విన్నాను. అతను ఆమెని షుగర్ బన్ అని సంబోధించాడు. మీరు అతన్ని పట్టుకు తీరాలి. లేదా నేను భద్రతగా ఉండలేను’
‘అతను మీతో మాట్లాడాడా? లేదా మీరు వింటున్నారని తెలుసుకున్నాడా?’ లెఫ్టినెంట్ జేసన్ ప్రశ్నించాడు.
‘లేదు’
‘ఐతే మీరు వాళ్ల సంభాషణని విన్నారని అతనికి ఎలా తెలుసు?’
‘అది నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా మేరీ లూ హత్య చేయబడింది. నేను ఇది చెప్పినా మీ సిబ్బంది లక్ష్యపెట్టడంలేదు. న్యూయార్క్‌లో ఇది రొటీన్ కావచ్చు. విస్కాన్‌సిన్‌లోని మా రాసిన్‌లో పోలీస్ చీఫ్‌కి ఇలాంటి ఫిర్యాదు అందితే ఊర్కోడు’
‘సరే. మేం కూడా ప్రయత్నం చేస్తాం మిస్ కెరోల్’ లెఫ్టినెంట్ చెప్పాడు.
‘ఎవరో రాంగ్ నంబర్ని డయల్ చేసి ఆ సంగతి తెలీగానే పెట్టేసి ఉండచ్చు. మీరు విన్నది రేడియో లేదా టివి డ్రామాలోని సంభాషణై ఉండచ్చు’ సార్జెంట్ పాల్ సూచించాడు.
‘అది నిజంగా జరిగిన భయంకర సంభాషణ. ఇంకా నాకు ఆమె కేక వినిపిస్తోంది. దాన్ని నేను మర్చిపోలేక పోతున్నాను. మీరు నన్ను నమ్మడం లేదు. సరే, మీలో ఎవరు నమ్మకపోయినా నేను కేర్ చేయను. మేరీ లూ అనే వ్యక్తి ఉందని నాకు తెలుసు. లేరీ ఆమెని మేరీ లూ అని పిలుస్తాడని కూడా తెలుసు. లేరీ ఆ కాల్‌ని అందుకోలేక పోవడంతో ఆమెకి సహాయం చేయలేక పోయాడు. దాంతో ఆమె వంటరిగా సహాయం కోసం అరుస్తూ మరణించింది. మీరు దీన్ని ఆలస్యం కాకుండా పట్టించుకోకపోతే నేనే కనుక్కుంటాను’ కోపంగా చెప్పి కెరోల్ బయటకి వెళ్లిపోయింది.
‘మీరేం అనుకుంటున్నారు’ సార్జెంట్ పాల్ తన బాస్‌ని అడిగాడు.
‘నాకు ఆమె ఇంటికి దూరమై వొంటరిగా ఫీలయ్యే మనిషిలా అనిపించింది. ఎవరితోనైనా మాట్లాడుదామని ఇక్కడికి వచ్చింది’ లెఫ్టినెంట్ జేసన్ చెప్పాడు.
‘కాని ఆమె నిజంగా భయపడినట్లుగా నాకు అనిపించింది’ సార్జెంట్ చెప్పాడు.
* * *
కెరోల్ టెలిఫోన్ కంపెనీకి వెళ్లి తన అపార్ట్‌మెంట్‌కి వచ్చిన వయోలాని కలిసింది.
‘మిస్టర్ వయోలా. నన్ను గుర్తుపట్టారా? నిన్న శుక్రవారం రాత్రి మీరు మా ఇంట్లో ఫోన్ ఫిక్స్ చేశారు’ అడిగింది.
‘గుర్తున్నారు. అపార్ట్‌మెంట్ నంబర్ ఒన్ బి. సస్కెహెన్నా 47568 కదా?’
‘అవును. మీరా నంబర్ని నా ఫ్లాట్‌లో ఫిక్స్ చేయక మునుపు అది ఎవరిది? వారి పేరు అడ్రెస్ ఇవ్వగలరా?’ కోరింది.
‘ఓ క్లైంట్ విషయం వారి అనుమతి లేకుండా నేను బయటి వాళ్లకి చెప్పకూడదు. నా ఉద్యోగం పోతుంది. ఐనా మీకు ఆ సమాచారం దేనికి?’ వయోలా ప్రశ్నించాడు.
‘ఈ ఊళ్లో ఒకరు ఓ అమ్మాయిని చంపారు. ఆమె ఎవరో కనుక్కోవాలి.’
‘ఏమిటి?’
‘శుక్రవారం సాయంత్రం మీరు వెళ్లిన కొద్ది నిమిషాలకి అది జరిగింది.’
తను విన్నది వివరించింది. వయోలా కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పాడు.
‘నేను ఈ సమాచారం మీకు ఇచ్చానని ఎవరికీ చెప్పకండి.’
* * *
లేరీకి తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. వెళ్లి తలుపు తెరచి, బయట నిలబడ్డ కెరోల్‌ని చూసి పక్కకి తప్పుకున్నాడు.
‘మీరు లేరీ బెన్సనా?’ ఆమె లోపలికి వచ్చి అడిగింది.
‘అవును. మీరు?’
‘మేరీ లూ, రెండు రోజులుగా మీ కోసం ప్రయత్నిస్తున్నాను. మీకు మేరీ లూ తెలుసా?’ అడిగింది.
‘తెలుసు. మీరు నాకు తెలుసు’
‘మేరీ లూ మరణించింది.’
అతనిలో ఎలాంటి స్పందనా లేకపోవడంతో చెప్పింది.
‘శుక్రవారం రాత్రి మీ సహాయం కోసం ఫోన్ చేసింది’
‘మీరు చెప్పేది నాకు అర్థం కావడంలేదు’ మేరీ ఆమె చేతిలో స్కాచ్ గ్లాస్‌ని ఉంచి చెప్పాడు.
‘మీ ఇదివరకటి ఫోన్ నంబర్ సస్కెహెన్నా 47568 కదా?’ అడిగింది.
‘అవును. నాకు ఇష్టం లేని చాలామంది ఫోన్ చేస్తూండటంతో నంబర్ మార్చుకున్నాను.’
‘చాలామంది అమ్మాయిలా? మేరీ లూ లాంటి అమ్మాయిలా?’ కెరోల్ అడిగింది.
అతను పకపకా నవ్వాడు.
‘అవును. ఆ పిల్ల పేరు మేరీ లూ. ఆమెకి మరో బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నువ్వు ఏదైనా చిన్న ఊరి నించి వచ్చావా?’
‘అది మీకు అనవసరం. మేరీ లూ ఎక్కడ ఉండేది?’ ప్రశ్నించింది.
‘ఎప్పుడూ అడగలేదు’
‘ఎక్కడ కలిశారు?’
‘బార్లో’ అతను ఇంకో గ్లాస్‌లో స్కాచ్ వంచుకుని తాగుతూ చెప్పాడు.
‘ఏ బార్లో?’
‘గుర్తు లేదు. చాలా బార్లున్నాయి.’
‘చాలామంది మేరీ లూలు లేరుగా? మీరు నాకా సమాచారం చెప్పకపోతే ఈసారి పోలీసులతో వస్తాను’ బెదిరించింది.
‘తప్పకుండా తీసుకురా’ పకపక నవ్వి చెప్పాడు.
* * *
తను తెలుసుకున్న సమాచారంతో కెరోల్ మళ్లీ పోలీసుస్టేషన్‌కి వెళ్లింది. కాని లెఫ్టినెంట్ జేసన్ మరో అరగంటకి కాని రాడని తెలిసి వేచి ఉంది. అక్కడికి వచ్చిన ఒకతను సార్జెంట్‌తో చెప్పాడు.
‘సార్జెంట్. ఈ రాత్రి నా డ్యూటీ మీ స్టేషన్‌లో’
‘నువ్వు వేసుకున్న బట్టలు అవుటాఫ్ స్టైల్’ సార్జెంట్ నవ్వుతూ చెప్పాడు.
‘సార్జెంట్. సరైన పదం ఎనక్రానిస్టిక్’
‘మీరు రాసే వార్తలో ఆ పదం వాడితే మీ పాఠకులకి అర్థం కాదు’ సార్జెంట్ నవ్వుతూ చెప్పాడు.
ఆ సంభాషణ విన్న కెరోల్ లేచి అతని దగ్గరికి వెళ్లి అడిగింది.
‘మీరు పత్రికా విలేకరా?’
‘అవును. మీ దగ్గర ఓ వార్త ఉందా?’ అతను ప్రశ్నించాడు.
‘ఉంది. మేరీ లూ గురించి’ చెప్పింది.
‘వివరంగా చెప్పండి. ఆమె ఎవరు?’
‘చంపబడింది. ఎవరూ నా మాట నమ్మడంలేదు’ కెరోల్ చెప్పింది.
‘నేను నమ్ముతాను’ అతను జేబులోంచి పెన్, నోట్‌బుక్ బయటకి తీశాడు.
* * *
మర్నాడు ది డైలీ జర్నల్ అనే దినపత్రికలో ‘మేరీ లూ. నువ్వు ఎక్కడున్నావు?’ అనే శీర్షికతో వార్త వెలువడింది. దాన్ని చదివిన సార్జెంట్ పాల్ లెఫ్టినెంట్ జేసన్‌తో చెప్పాడు.
‘ఆమె లేరీని కనుక్కుంది. కాబట్టి ఆమె చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది.’
‘ఇవాళ బుధవారం. అది జరిగి ఐదు రోజులైంది. ఈ మేరీ లూ చంపబడితే గుర్తించబడని శవం గురించి మనకి ఈపాటికి సమాచారం అందేది. శవం అంత తేలిగ్గా మాయం అవదు.’
‘మీరు చెప్పింది నిజం అవచ్చు. నేను దీన్ని కనుక్కోనా?’ పాల్ ప్రశ్నించాడు.
‘అలాగే’ జేసన్ అనుమతించాడు.
* * *
ఆ రాత్రి తలుపు చప్పుడు వినిపించడంతో కెరోల్ తలు దగ్గరకి వెళ్లి అడిగింది.
‘ఎవరది?’
‘నేను దినపత్రికలో ఆ వార్త చదివాను. మీకు సహాయం చేయాలని వచ్చాను’ జానీ బయట నించి చెప్పాడు.
‘్థంక్ యు. కాని రాత్రి పదైంది. ఆలస్యం కాదా?’ తలుపు తీయకుండా అడిగింది.
‘సారీ. అవును. కానీ మేరీ లూకి సంబంధించిన సమాచారం ఇద్దామని వచ్చాను. నాకు ఆమె చూచాయగా తెలుసు.’
‘ఐతే లోపలికి రండి’ చెప్పి తలుపు తెరచింది.
‘సారీ. ఇంత ఆలస్యంగా వస్తున్నానని గుర్తించలేదు. మీరు మేరీ లూ విషయంలో చాలా మంచి పని చేస్తున్నారు. ఎవరూ ఇలా చేయరు’ జానీ చెప్పాడు.
‘మీ పేరు చెప్పనే లేదు?’ కెరోల్ అడిగింది.
‘జానీ ఓ రిక్’
‘నేనే కెరోల్ థామస్‌ని. మీకు మేరీ లూ తెలుసా?’
‘ఆమె ఆర్నెల్ల క్రితం మా ప్లాంట్‌లో పని చేసేది. మానేసింది.’
‘ఆమె చిరునామా చెప్పగలరా?’
‘ఈ ఆదివారం మీరు ఫ్రీగా ఉంటే కలుద్దామా? అప్పుడు తెస్తాను. మీకు ఐస్ స్కేటింగ్ వచ్చా?’ అడిగాడు.
‘చిన్నప్పుడు చేసేదాన్ని.’
‘రాక్‌ఫెల్లర్ ప్లాజాలో ఈ వీకెండ్ కలుద్దాం. అక్కడ ఐస్ స్కేటింగ్ ఆరంభం అవుతోంది’ జానీ ఆహ్వానించాడు.
‘అలాగే’ ఆనందంగా ఒప్పుకుంది.
* * *
సార్జెంట్ పాల్ ఆ కేస్ గురించి పరిశోధన ఆరంభించాడు. డిటెక్టివ్ పనిలోని నైపుణ్యం నడక, ప్రశ్నించడం, సహనం, మళ్లీ నడక, ప్రశ్నించడం, సహనం. న్యూయార్క్ నగరంలో అనేక చిన్న నగరాలు ఉన్నాయి. వాటికి వెళ్లి అనేక మందిని, పచారీ దుకాణాల్లో, మందుల షాపుల్లో, రెస్ట్‌రెంట్లలో, బేకరీల్లో, ఫాస్ట్ఫుడ్ కార్నర్స్‌లో అతను మేరీ లూ గురించి ప్రశ్నించాడు. సరైన వ్యక్తిని ప్రశ్నిస్తే తనకి మేరీ లూ గురించి తెలుస్తుందని అతను ఆశించాడు.
చివరకి పాల్ సాధించాడు. ఆమె పేరు మేరీ లూ కానర్స్ అని ఓ బేకరీ సేల్స్‌మేన్ చెప్పాడు. వారం నించిరావడం లేదని, ఆమె చిరునామా కూడా చెప్పాడు.
* * *
లేరీకి తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. వెళ్లి తలుపు తెరచి, బయట నిలబడ్డ కెరోల్‌ని చూసి పక్కకి తప్పుకున్నాడు.
‘మీరు లేరీ బెన్సనా?’ ఆమె లోపలికి వచ్చి అడిగింది.
‘అవును. మీరు?’
‘మేరీ లూ, రెండు రోజులుగా మీ కోసం ప్రయత్నిస్తున్నాను. మీకు మేరీ లూ తెలుసా?’ అడిగింది.
‘తెలుసు. మీరు నాకు తెలుసు’
‘మేరీ లూ మరణించింది.’
అతనిలో ఎలాంటి స్పందనా లేకపోవడంతో చెప్పింది.
‘శుక్రవారం రాత్రి మీ సహాయం కోసం ఫోన్ చేసింది’
‘మీరు చెప్పేది నాకు అర్థం కావడంలేదు’ మేరీ ఆమె చేతిలో స్కాచ్ గ్లాస్‌ని ఉంచి చెప్పాడు.
‘మీ ఇదివరకటి ఫోన్ నంబర్ సస్కెహెన్నా 47568 కదా?’ అడిగింది.
‘అవును. నాకు ఇష్టం లేని చాలామంది ఫోన్ చేస్తూండటంతో నంబర్

రాంగ్‌నంబర్ (11వ పేజీ తరువాయ)
మార్చుకున్నాను.’
‘చాలామంది అమ్మాయిలా? మేరీ లూ లాంటి అమ్మాయిలా?’ కెరోల్ అడిగింది.
అతను పకపకా నవ్వాడు.
‘అవును. ఆ పిల్ల పేరు మేరీ లూ. ఆమెకి మరో బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నువ్వు ఏదైనా చిన్న ఊరి నించి వచ్చావా?’
‘అది మీకు అనవసరం. మేరీ లూ ఎక్కడ ఉండేది?’ ప్రశ్నించింది.
‘ఎప్పుడూ అడగలేదు’
‘ఎక్కడ కలిశారు?’
‘బార్లో’ అతను ఇంకో గ్లాస్‌లో స్కాచ్ వంచుకుని తాగుతూ చెప్పాడు.
‘ఏ బార్లో?’
‘గుర్తు లేదు. చాలా బార్లున్నాయి.’
‘చాలామంది మేరీ లూలు లేరుగా? మీరు నాకా సమాచారం చెప్పకపోతే ఈసారి పోలీసులతో వస్తాను’ బెదిరించింది.
‘తప్పకుండా తీసుకురా’ పకపక నవ్వి చెప్పాడు.
* * *
తను తెలుసుకున్న సమాచారంతో కెరోల్ మళ్లీ పోలీసుస్టేషన్‌కి వెళ్లింది. కాని లెఫ్టినెంట్ జేసన్ మరో అరగంటకి కాని రాడని తెలిసి వేచి ఉంది. అక్కడికి వచ్చిన ఒకతను సార్జెంట్‌తో చెప్పాడు.
‘సార్జెంట్. ఈ రాత్రి నా డ్యూటీ మీ స్టేషన్‌లో’
‘నువ్వు వేసుకున్న బట్టలు అవుటాఫ్ స్టైల్’ సార్జెంట్ నవ్వుతూ చెప్పాడు.
‘సార్జెంట్. సరైన పదం ఎనక్రానిస్టిక్’
‘మీరు రాసే వార్తలో ఆ పదం వాడితే మీ పాఠకులకి అర్థం కాదు’ సార్జెంట్ నవ్వుతూ చెప్పాడు.
ఆ సంభాషణ విన్న కెరోల్ లేచి అతని దగ్గరికి వెళ్లి అడిగింది.
‘మీరు పత్రికా విలేకరా?’
‘అవును. మీ దగ్గర ఓ వార్త ఉందా?’ అతను ప్రశ్నించాడు.
‘ఉంది. మేరీ లూ గురించి’ చెప్పింది.
‘వివరంగా చెప్పండి. ఆమె ఎవరు?’
‘చంపబడింది. ఎవరూ నా మాట నమ్మడంలేదు’ కెరోల్ చెప్పింది.
‘నేను నమ్ముతాను’ అతను జేబులోంచి పెన్, నోట్‌బుక్ బయటకి తీశాడు.
* * *
మర్నాడు ది డైలీ జర్నల్ అనే దినపత్రికలో ‘మేరీ లూ. నువ్వు ఎక్కడున్నావు?’ అనే శీర్షికతో వార్త వెలువడింది. దాన్ని చదివిన సార్జెంట్ పాల్ లెఫ్టినెంట్ జేసన్‌తో చెప్పాడు.
‘ఆమె లేరీని కనుక్కుంది. కాబట్టి ఆమె చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది.’
‘ఇవాళ బుధవారం. అది జరిగి ఐదు రోజులైంది. ఈ మేరీ లూ చంపబడితే గుర్తించబడని శవం గురించి మనకి ఈపాటికి సమాచారం అందేది. శవం అంత తేలిగ్గా మాయం అవదు.’
‘మీరు చెప్పింది నిజం అవచ్చు. నేను దీన్ని కనుక్కోనా?’ పాల్ ప్రశ్నించాడు.
‘అలాగే’ జేసన్ అనుమతించాడు.
* * *
ఆ రాత్రి తలుపు చప్పుడు వినిపించడంతో కెరోల్ తలుపు దగ్గరకి వెళ్లి అడిగింది.
‘ఎవరది?’
‘నేను దినపత్రికలో ఆ వార్త చదివాను. మీకు సహాయం చేయాలని వచ్చాను’ జానీ బయట నించి చెప్పాడు.
‘్థంక్ యు. కాని రాత్రి పదైంది. ఆలస్యం కాదా?’ తలుపు తీయకుండా అడిగింది.
‘సారీ. అవును. కానీ మేరీ లూకి సంబంధించిన సమాచారం ఇద్దామని వచ్చాను. నాకు ఆమె చూచాయగా తెలుసు.’
‘ఐతే లోపలికి రండి’ చెప్పి తలుపు తెరచింది.
‘సారీ. ఇంత ఆలస్యంగా వస్తున్నానని గుర్తించలేదు. మీరు మేరీ లూ విషయంలో చాలా మంచి పని చేస్తున్నారు. ఎవరూ ఇలా చేయరు’ జానీ చెప్పాడు.
‘మీ పేరు చెప్పనే లేదు?’ కెరోల్ అడిగింది.
‘జానీ ఓ రిక్’
‘నేనే కెరోల్ థామస్‌ని. మీకు మేరీ లూ తెలుసా?’
‘ఆమె ఆర్నెల్ల క్రితం మా ప్లాంట్‌లో పని చేసేది. మానేసింది.’
‘ఆమె చిరునామా చెప్పగలరా?’
‘ఈ ఆదివారం మీరు ఫ్రీగా ఉంటే కలుద్దామా? అప్పుడు తెస్తాను. మీకు ఐస్ స్కేటింగ్ వచ్చా?’ అడిగాడు.
‘చిన్నప్పుడు చేసేదాన్ని.’
‘రాక్‌ఫెల్లర్ ప్లాజాలో ఈ వీకెండ్ కలుద్దాం. అక్కడ ఐస్ స్కేటింగ్ ఆరంభం అవుతోంది’ జానీ ఆహ్వానించాడు.
‘అలాగే’ ఆనందంగా ఒప్పుకుంది.
* * *
సార్జెంట్ పాల్ ఆ కేస్ గురించి పరిశోధన ఆరంభించాడు. డిటెక్టివ్ పనిలోని నైపుణ్యం నడక, ప్రశ్నించడం, సహనం, మళ్లీ నడక, ప్రశ్నించడం, సహనం. న్యూయార్క్ నగరంలో అనేక చిన్న నగరాలు ఉన్నాయి. వాటికి వెళ్లి అనేక మందిని, పచారీ దుకాణాల్లో, మందుల షాపుల్లో, రెస్ట్‌రెంట్లలో, బేకరీల్లో, ఫాస్ట్ఫుడ్ కార్నర్స్‌లో అతను మేరీ లూ గురించి ప్రశ్నించాడు. సరైన వ్యక్తిని ప్రశ్నిస్తే తనకి మేరీ లూ గురించి తెలుస్తుందని అతను ఆశించాడు.
చివరకి పాల్ సాధించాడు. ఆమె పేరు మేరీ లూ కానర్స్ అని ఓ బేకరీ సేల్స్‌మేన్ చెప్పాడు. వారం నించిరావడం లేదని, ఆమె చిరునామా కూడా చెప్పాడు.
*

-మల్లాది వెంకట కృష్ణమూర్తి