క్రైమ్/లీగల్

గుర్తు తెలియని చిన్నారి తల లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: గుర్తుతెలియని చిన్నారి తల ఓ భవనంపై లభ్యమైంది. చిన్నారిని దుండగులు కత్తితో దారుణంగా నరికి హత్య చేసి తలను ఇక్కడ పెట్టినప్పటికీ.. మొండెం ఎక్కడ ఉందో తెలియడం లేదు. విషాధమైన ఘటన ఉప్పల్ పోలీసు పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ చిల్కానగర్‌లో నివసిస్తున్న క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపైన నరికి వేసిన మూడు నెలల చిన్నారి తల ఉన్నట్లు బట్టలు ఆరవేయడానికి పైకి వెళ్లిన కుటుంబ సభ్యులు గమనించి భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కత్తితో మెడపై నరికినట్లు, కత్తిపోట్లు ఉన్నట్లు ఆనవాళ్లు కన్పించాయి. విషయం తెలుసుకున్న రాచకొండ జాయింట్ సీపీ తరుణ్ జోషీ, మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ, ఇన్‌చార్జి అడిషనల్ డీసీపీ రఫీక్, ఇన్‌స్పెక్టర్ పీ.వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని పరిశీలించారు. తలకు ఒకవైపు చెవితో పాటు మొండెం కన్పించకపోవడంతో నిండు పౌర్ణమి రోజైన బుధవారం క్షుద్రపూజల కోసమే హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీంను రప్పించి విచారణ చేపట్టారు. తల లభ్యమైన రాజశేఖర్ ఇంటి పక్కన ఉన్న నరహరి ఇంట్లోకి, భవనంపైకి డాగ్ స్క్వాడ్ వెళ్లడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. దారణంగా చంపబడ్డ చిన్నారి తల లభ్యం కావడంతో చిల్కానగర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

చిత్రం..సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీసీపీ ఉమామహేశ్వరశర్మ (ఇన్‌సెట్‌లో) చిన్నారి తల