క్రైమ్/లీగల్
ఇద్దరు బ్యాంక్ అధికారుల అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లబ్ధి చేకూర్చిన ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అధికారులను సీబీఐ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పీఎన్‌బీలో చోటుచేసుకున్న 11,400కోట్ల రూపాయల కుంభకోణం కేసులో సూత్రధారి నీరవ్ మోదీకి ఈ అధికారులు ఇద్దరూ సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అరస్టయిన ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల్లో ఒకరు ఇటీవలే పదవీ విరమణ చేశారు. గోకుల్‌నాథ్ షెట్టీ (రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్), మనోజ్ కారత్ (సింగిల్ విండో ఆపరేటర్)ను అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. హేమంత్ భట్ అనే మరొక ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జనవరి 31న నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈ అరెస్టులు చేసినట్టు సీబీఐ తెలిపింది. నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీపై సీబీఐ కేసు నమోదు చేసింది. 280 కోట్లకు సంబంధించి జరిగిన ఎనిమిది అక్రమ లావాదేవీలు జరిగినట్టు పీఎన్‌బీ తొలుత ఫిర్యాదులో పేర్కొంది. అయితే సీబీఐ దర్యాప్తులో రూ.4,886 కోట్లని తేలింది. దీంతో శుక్రవారంనాడు గీతాంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీలపై సీబీఐ మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అన్ని లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లూ 2017-18 మధ్యే జారీ అయినట్టు దర్యాప్తులో వెల్లడైంది.