క్రైమ్/లీగల్

లారీని ఢీకొట్టిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూన్ 9: మండల పరిధిలోని కాటుకపల్లి - ఏడుగుర్రాలపల్లి గ్రామాల మధ్య ఓ కారు శనివారం సాయంత్రం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో తరలిస్తున్న గంజాయి రోడ్డుపై వెదజల్లిపడినట్టు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..చింతూరు వైపు నుంచి ఒక కారు భద్రాచలం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఏడుగుర్రాలపల్లి- కాటుకపల్లి గ్రామాల మధ్య కారు టైర్ పంచర్ కావడంతో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. కానీ కారు ఇంజిన్‌లో రహస్యంగా దాచి తరలిస్తున్న గంజాయి ఈ ప్రమాదం కారణంగా కారులో నుంచి రోడ్డుపై వెదజల్లి పడినట్లు అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తీరును ప్రయాణికులు పరిశీలిస్తుండగా రోడ్డుపై పడిన గంజాయిని వారు చూశారు. ప్రయాణికులు గంజాయిని గుర్తించినట్టు తెలుసుకున్న గంజాయి స్మగ్లర్లు అక్కడ నుంచి కారును వదిలేసి ఉడాయించినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏడుగుర్రాలపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పిడుగు పడి వ్యక్తి మృతి
జగ్గంపేట, జూన్ 9: జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో పిడుగు పడి వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన పశువుల కాపరి ఒంటిపల్లి పెదకాపు, మునీశ్వరు అనే ఇద్దరు పశువులను మేపుకుంటుండగా ఒక్కసారిగా శనివారం సాయంత్రం ఆకస్మాతుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో వారు తలదాచుకోవడానికి తుమ్మ చెట్టుకిందకు వెళ్లారు. అయితే ఇంతలో ఒక్కసారిగా పిడుగు పడటంతో పెదకాపు అక్కడిక్కడే మృతి చేందాడు. మునీశ్వరుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడు గ్రామంలోకి వచ్చి జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పాడు.