క్రైమ్/లీగల్

సెల్‌ఫోన్లు దొంగిలించి నెంబర్ల క్లోనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ఖరీదైన సెల్‌ఫోన్లు కొట్టేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఎంఈఐ నెంబర్లను క్లోనింగ్ చేయడం ద్వారా వాటిని పలు రాష్ట్రాలు, బ్యాంకాగ్ దేశానికి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ జోన్ డిసిపి పి.విశ్వప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం మహ్మద్ మహబూబ్, షేక్ నజీర్ అహ్మద్, మహ్మద్ నజీరుద్దీన్, మహ్మద్ మొహసిన్, అబ్ధుల్ ఘనిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. మహబూబ్ పాత నేరస్తుడు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మొబైల్స్‌ను కాజేసిన కేసుల్లో నిందితుడు. గత ఆరు నెలల కిందట నజీర్‌తో స్నేహం కుదిరింది. అప్పటి నుంచి దొంగిలించిన సెల్‌ఫోన్లను విక్రయించడం, ఇద్దరు కలిసి దొంగిలించడంలో భాగస్వాములయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సిటీ బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణీకుల జేబుల్లో, బ్యాగ్గుల్లో ఉన్న సెల్‌ఫోన్లను కొట్టేస్తున్నారు. వీటిని అబ్ధుల్ ఘని ద్వారా నజీరుద్దీన్, మొహసిన్‌లకు విక్రయించే వాడు. మొసిన్ ల్యాప్‌ట్యాబ్ ఉపయోగించి ఆ మొబైల్ పాస్‌వర్డ్, ప్యాటరన్ లాక్స్‌ను తెరచి వాటి ఐఎంఈఐ వివరాలు తెలుసుకుని క్లోనింగ్ చేసి అనంతరం వాటిని అబిడ్స్ జగదీశ్ మార్కెట్‌తో పాటు బ్యాంకాగ్, ఇతర ప్రాంతాలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి 31 ఐఫోన్లు, శ్యామ్‌సంగ్ 12, ఇతర ఫోన్లు 37 స్వాధీనం చేసుకున్నారు.
క్లోనింగ్ కోసం వాడే డెల్ కంపెనీ సిపియు, డెల్ ల్యాప్‌టాప్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.