క్రైమ్/లీగల్
సీఐడీకి పట్టుబడ్డ ‘బొమ్మరిల్లు’ రాజా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మచిలీపట్నం, ఫిబ్రవరి 17: అగ్రిగోల్డ్ మాదిరిగా ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి గత మూడేళ్లుగా పరారీలో ఉన్న బొమ్మరిల్లు ఫారమ్స్ అండ్ విల్లాస్ అధినేత రాయల రాజాను ఎట్టకేలకు సీఐడీ అధికారులు పట్టుకుని శనివారం మచిలీపట్నం సబ్ జైలుకు పంపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం వేదికగా విజయనగరం, శ్రీకాకుళం, చక్కలి, హైదరాబాద్, ఆదిలాబాద్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసిన ఈ సంస్థ 2013లో జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కూడా బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 5వేల మంది సదరు సంస్థలో రూ.1.50కోట్ల మేర డిపాజిట్లు చేశారు. బందరు మండలం గోకవరంలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక వెంచర్‌ను, గూడూరు మండలం పర్ణశాలలో 22 ఎకరాలో ఒక వెంచర్‌ను సైతం ఏర్పాటు చేశారు. అపరిమితమైన ఆఫర్లతో ఖాతాదార్లను ఆకర్షించి, 2014 జనవరిలో ఒక్కసారి సంస్థ బోర్డు తిప్పేసింది. అన్ని బ్రాంచ్‌ల నుండి సదరు సంస్థపై కేసులు నమోదు చేయగా బాధితుల ఆందోళన నేపథ్యంలో విచారణను సీఐడీకి అప్పగించారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం సంస్థ డైరెక్టర్ రాయల రాజాను హైదరాబాద్‌లో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణా జిల్లా కోర్టులో హాజరుపర్చేందుకు మచిలీపట్నం తీసుకు వచ్చారు. అయితే న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా సీఐడీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ నిందితుడు రాయల రాజాను మండల మెజిస్ట్రేట్, తహశీల్దార్ బి నారదముని ముందు హాజరు పర్చి 14 రోజుల పాటు రిమాండ్ విధించి బందరు సబ్ జైలుకు తరలించారు.