క్రైమ్/లీగల్

వ్యక్తి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జూన్ 10:పట్టణంలోని నీలి షికారి పేటలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతడిని నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన నరసింహులుగా(40)గా పోలీసులు గుర్తించారు. నీలిషికారి పేటలోని ఓ పాడుబడిన ఇంటిలో నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతదేహం కనబడడంతో దానిని పోస్టుమార్టం కోసం నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా నరసింహులు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడాన్ని బట్టి అతడు 4 రోజుల క్రితమే మృతిచెంది వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటోను ఢీకొన్న లారీ.. ఒకని మృతి
అవుకు, జూన్ 10:మండల పరిధిలోని గుండ్లశింగవరం గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం అటోను లారీ ఢీకొన్న సంఘటనలో అవుకు గ్రామానికి చెందిన మంగళి సత్యనారాయణ(43) దుర్మరణం చెందగా అటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వివరాలు.. అవుకు వైపు నుంచి బనగానపల్లెకు పాలు తీసుకెళ్తున్న ఆటోను, అవుకు నుంచి బనగానపల్లె వైపు శరవేగంగా వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇక ఆటోను ఢీకొన్న లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో కోవెలకుంట్ల పోలీసులు లారీని అదుపులోకి తీసుకుని అవుకు స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.