క్రైమ్/లీగల్

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జూన్ 10: స్నేహితులతో కలిసి కాకినాడ బీచ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ ఉన్న ఉప్పుటేరు వంతెన పైనుండి సెల్ఫీ తీసుకుంటూ ఉప్పుటేరులో పడి మునిగిపోయాడు. అయితే స్నేహితులు సకాలంలో రక్షించడంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో కాకినాడ రూరల్ వాకలపూడి బీచ్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నగరం సూర్యనారాయణపురం యాళ్లవారి వీధిలో నివాసం ఉండే మజ్జి శ్రీనివాస్ (25) అనే వ్యక్తి ఆదివారం తన స్నేహితులతో కలిసి కాకినాడ రూరల్ వాకలపూడి బీచ్‌కు వెళ్లాడు. బీచ్‌లో కొంతసేపు స్నేహితులతో సరదాగా సముద్ర స్నానాలు చేశాడు. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో స్నేహితులతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లడానికి తిరిగి వస్తూ బీచ్ సమీపంలో ఉన్న ఉప్పుటేరు వంతెన పై నుండి సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో వంతెన పైనుండి అదుపుతప్పి ఉప్పుటేరులో పడిపోయాడు. నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు ఉప్పుటేరులోకి దూకి అతడిని రక్షించి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ అధిక మోతాదులో ఉప్పునీటిని తాగడంతో ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై తిమ్మాపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.6 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
- ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదు
సామర్లకోట, జూన్ 10: సామర్లకోట కేంద్రంగా జిల్లాలో పలు ప్రాంతాలకు విక్రయానికి సిద్ధంగా ఉంచిన రూ.6 లక్షలు విలువచేసే నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లు సరుకును ఆదివారం సామర్లకోటలో పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన గుట్కా సామాగ్రి, పట్టుకున్న ఆరుగురు వ్యాపారులను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో నిషేధించిన రాజా కంపెనీకి చెందిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను విక్రయాలు జరగకుండా జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తాజాగా తునిలో ఇటువంటి దాడులు చేపట్టి సరుకును భారీగా సీజ్ చేసినట్లు చెప్పారు. సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసునాయక్ ఆధ్వర్యంలో పెద్దాపురం సిఐ యాతం రామకృష్ణ శ్రీనువాసు (వైఆర్కే) బృందం ఆకస్మిక దాడులు చేపట్టి రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీబొమ్మ వద్ద పట్టుకున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంనకు చెందిన వ్యాపారులు రాసంశెట్టి రమేష్, కొత్తగూడెంకు చెందిన శ్యామ్ సుందరప్రసాద్, అప్పన అప్పారావు, దింటకుర్తి సత్యనారాయణ, కర్రి అప్పారావు, కొండల రామచంద్రారెడ్డిలను అరెస్టుచేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసునాయక్, పెద్దాపురం ఎస్సై ఎ కృష్ణ్భగవాన్, తులసీ తదితర సిబ్బంది పాల్గొన్నారు.