క్రైమ్/లీగల్

మహిళలను వేధించిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 10 : ఫేస్‌బుక్‌ల ద్వారా, వాట్సాప్‌ల ద్వారా మహిళలను వేధించి వారి వద్ద నుంచి బంగారం, నగదు అపహరించిన వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కాజేసిన బంగారాన్ని కూడా రికవరీ చేసినట్లు ఏలూరు డి ఎస్‌పి కె ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక దక్షిణపు వీధఙకి చెందిన చిల్లపల్లి ముకేష్ సాయి అనే వ్యక్తి కొంత కాలంగా భీమవరంలో నివాసముంటున్నాడన్నారు. డిగ్రీ పూర్తి చేసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారన్నారు. అతను ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆడవాళ్ల ప్రొఫైళ్లకు రిక్వెస్ట్‌పెట్టి వారు యాక్సెప్ట్ చేసి వారితో స్నేహితులుగా చాటింగ్ చేస్తూ వుంటాడు. అమ్మాయిలతో చేసే చాటింగ్, ఫొటోలు, స్క్రీన్‌షాట్ తీసి అతని వద్ద ఉంచుకుంటాడు. ఆ తర్వాత అవసరమని డబ్బు లేదా బంగారం ఇవ్వమని అమ్మాయిలను అడుగుతాడు. వారు ఇవ్వడానికి నిరాకరిస్తే చాటింగ్‌లు, ఫొటోలు తల్లిదండ్రులకు, బంధువులకు చూపిస్తానని బెదిరిస్తాడు. వారిని భయపెట్టి బంగారం కాజేస్తాడు. అలా కాజేసిన బంగారాన్ని ముకేష్ సాయి మణ్ణపురం, ప్రైవేటు ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లి విలాసాలకు ఖర్చు చేస్తుంటాడు. అదే క్రమంలో స్థానిక రామచంద్రరావుపేటకు చెందిన ఒక మహిళను హైదరాబాద్ మాదాపూర్‌లో గల హెచ్ ఎం ఎలివేషన్ ప్రైవేటు సెంటర్‌లో పరిచయం పెంచుకుని చాటింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తరచూ చాటింగ్ చేస్తుండేవాడు. ఆమెను ఏలూరు బస్టాండ్ ఆవరణకు రమ్మని, ఆమె వద్ద నుంచి రెండు కాసుల బంగారపు చెయిన్‌ను బలవంతంగా లాక్కున్నాడన్నారు. ముకేష్ విశాఖపట్నానికి చెందిన ఒక మహిళను పరిచయం చేసుకుని ఆమెకు వరుసకు చెల్లెలు అయిన ఆమెతో పరిచయం పెంచుకుని వాట్సప్ ద్వారా దఫదఫాలుగా బెదిరించి 528 గ్రాముల బంగారాన్ని దౌర్జన్యంగా తీసుకుని ఖర్చు చేశాడన్నారు. అతనిపై విశాఖపట్నంలో కూడా కేసు నమోదైందని అన్నారు. ఈ సందర్భంగా డి ఎస్‌పి మాట్లాడుతూ సమాజంలో ఎవరైనాగానీ ఇలా వాట్సప్‌ల ద్వారా చాటింగ్‌లు చేస్తూ బెదిరిస్తుంటే తక్షణమే 100కు గానీ, సమీప పోలీసు స్టేషన్‌కు గానీ తెలియజేస్తే వారి పేర్లు బహిర్గతం చేయకుండా గోప్యంగా వుంచి వారికి న్యాయం చేస్తామని సూచించారు. జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరు డి ఎస్‌పి కె ఈశ్వరరావు ప్రత్యేక పర్యవేక్షణలో ముకేష్ సాయిని ఆదివారం దక్షిణపు వీధిలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో సి ఐ శ్రీనివాసరావు, ఎస్ ఐ పైడిబాబు తదితరులున్నారు.