క్రైమ్/లీగల్

బాబా గుడిలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, జూన్ 10: మండల కేంద్రంలో భువనగిరి-నల్లగొండ ప్రధాన రహదారి ప్రక్కన చెరువు సమీపంలో గల సాయిబాబా గుడిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం నాడు గుడి పూజారి తలుపులు తీసేందుకై వెళ్లగా డోర్‌కు ఉన్న గడియను తొలగించి లోనికి ఎవరో ప్రవేశించినట్లు తెలిసింది. అదేవిధంగా గుడిలో ఉన్న హుండీని పగులగొట్టి అందులో ఉన్న కొంత నగదును దోచుకువెళ్లడం జరిగింది. కాగా సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్‌ఐ ఇద్రీస్ అలీ పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.