క్రైమ్/లీగల్

పోలీసుల వేధింపులతో వ్యక్తి మృతి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, జూన్ 10: గుండెపోటుతో వ్యక్తి మృతి చెందగా పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సాప్‌లో ఓ వార్త వైరల్‌గా మారిన సంఘటన ఇబ్రహీంపట్నంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని రాయపోల్ గ్రామానికి చెందిన వెంకటేష్ (43) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ఓ భూవివాదంలో చిక్కుకున్న వెంకటేష్‌పై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. దీంతో పోలీసులు వెంకటేష్‌ను విచారణ నిమిత్తం గత నెలలో పోలీస్‌స్టేషన్‌కు రప్పించి విచారణ పూర్తి చేసుకొని పంపించివేశారు. అయితే వెంకటేష్ శనివారం గుండెపోటుతో మృతి చెందడంతో దానిని కొంత మంది వాట్సాప్‌లో పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు వైరల్ చేశారు. దీంతో వార్త దావణంలా నియోజకవర్గం మొత్తం వ్యాపించింది. అసలు వివరాల్లోకి వెళితే గత 2003 సంవత్సరంలో వెంకటేష్ తన నలుగురు సోదరులతో కలిసి నగరంలోని కర్మాన్‌గాట్‌కు చెందిన కందాల అసంపాల్‌రెడ్డికి మండలంలోని రెయిన్‌గూడ గ్రామంలో రెండెకరాల భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. అయితే అదే భూమిని అంతకుముందే వెంకటేష్‌తో పాటు అతని సోదరులు కలిసి ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి, తనకు డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు అసంపాల్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ గత నవంబర్ నెలలో ఫిర్యాదు చేశారు. విషయంలో పోలీసులు విచారణ చేపట్టి వెంకటేష్ సోదరుడు ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వెంకటేష్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో అరెస్టు చేయలేదు. గత నెలలో విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా వెంకటేష్ కుమారుడు ఆరోగ్యం సరిగ్గా లేదని తన తండ్రిని ఇంటికి తీసుకెళ్ళాడు. కాగా వెంకటేష్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. దీనిపై సరైన సమాచారం లేని కొంత మంది వాట్సాప్‌లో తప్పుడు పోస్ట్‌లు పెట్టడంలో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
వేధించలేదు : సిఐ స్వామి స్పష్టీకరణ
భూవివాదంపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని, వెంకటేష్‌ను గత నెలలో విచారించిన మాట వాస్తవమేనని వేధింపులకు గురిచేయలేదని ఇబ్రహీంపట్నం సిఐ స్వామి వివరణ ఇచ్చారు. గత నెల 29న విచారణకు తీసుకొచ్చిన రోజునే వెంకటేష్ కుమారుడు మా నాన్నకు ఆరోగ్యం బాగా లేదని తిరిగి విచారణకు హాజరు పరుస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి తీసుకెళ్ళినట్లు చెప్పారు. గుండెపోటుతో వెంకటేష్ మృతి చెందడంతో దీనిని కొంత మంది ఆకతాయిలు వాట్సాప్‌లో పోలీసుల వేధింపుల కారణంగా మృతి చెందినట్లు తప్పుడు వార్తను పోస్ట్ చేశారని సిఐ తెలిపారు.