క్రైమ్/లీగల్

గోడకూలి ఇద్దరు కూలీలు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 10: పొట్ట గడవటం కోసం కూలి పనులకు వెళ్లిన ఇద్దరు యువకులు సంబంధిత పనులు చేస్తుండగా గోడకూలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానిక గవరపాలెం గౌరమ్మ గుడి వద్ద ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. స్థానిక గవరపాలెం గౌరమ్మ గుడి సమీపంలో బుద్ద ప్రకాశరావువీధికి చెందిన శరగడం నాయుడు ఇంటిలో పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇంటిదగ్గర పాత భవనాన్ని తొలగించే పనులు చేపడతుండగా పక్కనే ఉన్న మద్దాల జగ్గయమ్మకు చెందిన ప్రహారీగోడ కూలిపోయింది. దీంతో సంబంధిత పనులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వీరిలో మండలంలోని కూండ్రం గ్రామానికి చెందిన శానాపతి శ్రీనివాసరావు(32) అక్కడికక్కడే మృతిచెందగా బుచ్చెయ్యపేట మండలం ఆర్. శివరామపురం గ్రామానికి చెందిన గోకివాడ సత్తిబాబు (35)లు రాళ్ల కింద పడిపోగా అక్కడి వారు హుటాహుటిన సంబంధిత శిధిలాలను తొలగించి స్థానిక వందపడకల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం చెందారు. సత్తిబాబు, ఈశ్వరరావులు ప్రతీరోజు కూలిపనుల కోసం ఆటోలో అనకాపల్లి వస్తుంటారు. రోజు మాదిరిగానే ఇద్దరు కలిసి ఆటోలోవచ్చి కూలి పనులకు వెళ్లారు. సత్తిబాబు మరణంతో కుటుంబం వీధిన పడిపోయింది. శ్రీనివాసరావుకు భార్య, మూడేళ్ల కుమారుడు, పెళ్లికావాల్సిన చెల్లి, అతనిపై ఆధారపడి జీవించే తండ్రి పెంటారావు, తల్లి చిన్నమ్మ ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులంతా స్థానిక వందపడకల ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈసంఘటనలో మృతిచెందిన గోకివాడ సత్తిబాబుకు భార్య, పాప ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా వ్యవహరించే ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో ఆయా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అనకాపల్లి పట్టణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టంకై ఎన్టీఆర్ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు.