క్రైమ్/లీగల్

దంపతులను బలిగొన్న ఎలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస/సోంపేట/అనకాపల్లి, జూన్ 10: శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆదివారం చోటుచేసుకుంటున్న వేర్వేరు సంఘటనల్లో మొత్తం నలుగురు మృత్యువాతపడ్డారు. ప్రశాంతంగా ఉండే ఉద్దానంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడిపిక్కలు ఏరేందుకు బయలుదేరిన బైపల్లి ఊర్మిళ అనే మహిళపై ఇంటి ఆవరణలోనే ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనకు భీతిల్లిన ఆమె గట్టిగా కేకలు వేయడంతో భర్త తిరుపతిరావు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేసింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, ఎర్రముక్కాంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన సంభవించింది. దాడిలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. ఎలుగుబంటి అంతటితో ఆగకుండా మరో ఎనిమిదిమందిని గాయపరిచింది. రెండు మేకలు, కుక్క, రెండు ఆవులు సైతం ఎలుగుదాడిలో మృతి చెందాయి. దీంతో గ్రామస్థులంతా మూకుమ్మడి ఎలుగుబంటిని ఎదుర్కొని హతమార్చారు. సంఘటన తెలుసుకున్న ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాధితులను పరామర్శించారు.
గోడకూలి ఇద్దరు కూలీలు దుర్మరణం
పొట్ట కోసం కూలి పనులకు వెళ్ళిన ఇద్దరు యువకులు గోడకూలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనకాపల్లి గవరపాలెం గౌరమ్మ గుడి వద్ద ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. గవరపాలెం గౌరమ్మ గుడి సమీపంలో బుద్ద ప్రకాశరావువీధికి చెందిన శరగడం నాయుడు ఇంటిదగ్గర పాత భవనాన్ని తొలగించే పనులు చేపడుతుండగా పక్కనే ఉన్న మద్దాల జగ్గయమ్మకు చెందిన ప్రహారీగోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పనులు చేస్తున్న కూండ్రం గ్రామానికి చెందిన శానాపతి శ్రీనివాసరావు (32) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాల పాలైన బుచ్చయ్యపేట మండలం ఆర్.శివరామపురం గ్రామానికి చెందిన గోకివాడ సత్తిబాబు (35) ఆసుపత్రిలో మృతి చెందాడు.