క్రైమ్/లీగల్

సివిల్ అసిస్టెంట్ సర్జన్‌కు రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: లంచం తీసుకున్న కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ విక్టర్ దినేశ్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి భాస్కరరావు తీర్పు చెప్పారు. గురువారం ఏసీబీ డీజీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం 2010 అక్టోబర్ 22న కె మధు అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదానికి సంబంధించి మెడికల్ సర్ట్ఫికెట్ జారీ కోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఎసిబిని ఆశ్రయించడంతో వలపన్ని పట్టుకున్నారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించినట్లు చెప్పారు.