క్రైమ్/లీగల్

బ్యాంక్ ఉద్యోగిపై సీబీఐ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: గతంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో క్లర్క్ కం క్యాషియర్‌గా పనిచేసి, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి బ్రాంచీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వి.సంతోషి రాము ఆర్థిక నేరానికి పాల్పడినందుకు అతనిపై సీబీఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. సీబీఐ అధికారుల కథనం ప్రకారం రాము చీపురుపల్లి బ్రాంచీలో పని చేస్తున్నప్పుడు 1,71,41,162 రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ బ్రాంచీలో ది చీపురుపల్లి రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు ఖాతా ఉంది. వీరు విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లుల మొత్తాన్ని ఈ బ్రాంచీలో జమ చేస్తుంటారు. జమ చేసిన మొత్తానికి బ్యాంక్ ఎలక్ట్రానిక్ రశీదులు జారీ చేస్తుంటుంది. ఈ రశీదులపై అంకెలు కొన్ని రోజులకు కనిపించకుండా పోతున్నాయని, తమకు మాన్యువల్ రశీదులు కావాలని సొసైటీ యాజమాన్యం బ్యాంక్ యాజమాన్యాన్ని కోరింది. దీన్ని అదునుగా తీసుకుని సంతోషి రాము మాన్యువల్ రశీదులను సొసైటీకి జారీ చేశారు. అయితే, అందులో పేర్కొన్న మొత్తాన్ని సొసైటీ ఖాతాలో జమ చేయలేదు. కొంత కాలం తరువాత దఫదఫాలుగా ఆయా మొత్తాలను సొసైటీ ఖాతాలో జమ చేసినట్టు సీబీఐ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.