క్రైమ్/లీగల్
అనుమానస్పద స్థితిలో ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాలు లభ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒంటిమిట్ట, ఫిబ్రవరి 18:కడప-చెన్నై జాతీయ రహదారిలోని మండల కేంద్రమైన ఒంటిమిట్ట చెరువులో ఆదివారం అనుమానస్పదస్థితిలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలు పురుషులుగా ఉన్నాయి. వీరంతా లుంగీ, చొక్కా ధరించి ఉన్నారు. మృతదేహాల తీరుపై పలు ఆరోపణలు గుప్పుమంటున్నారు. వీరు ఏమైనా ఎర్రచందనం కూలీలా, వ్యవసాయ కూలీలా అన్న అనుమానాలు చూసినవారిలో తలెత్తుతున్నాయి. మృతదేహాలను చూసేవారిని శోకసముద్రంలో ముంచుతుంది. వీరు జీవనోపాధి కోసం వచ్చారా, ఇతరత్రా కారణాలతో ఏమైనా ఆత్మహత్యలకు పాల్పడ్డారా అనే ఆరోపణలు సంఘటనా స్థలంలో వెలువడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కడప ఓఎస్డీ నవీన్, రాజంపేట డిఎస్పీ లక్ష్మీనారాయణ వారి బృందాలతో వచ్చి నీటిలో ఉన్న మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన మరోమారు తెలిపారు. నీటిలోని మృతదేహాలను అతి కష్టంపై వెలికి తీశారు. ఐదు మృతదేహాలు ఒకేసారి వెలికి తీయడంతో హైవేలో వెళ్లే ప్రతి ఒకరుచూసి శోకసముద్రంలో మునిగారు. మృతుల వివరాలు పోలీస్ విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.
ఈ సంఘటన బాధాకరం : విప్ మేడా
ఒంటిమిట్ట చెరువులో ఆదివారం ఐదు మృతదేహాలు బయటపడిన సంఘటన బాధాకరమని విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి అన్నారు. విషయం తెలుసుకున్న వారు సంఘటనా స్థలానికి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతులు ఏ ప్రాంతం వారో పోలీస్ విచారణలో తెలియాల్సి ఉందన్నారు. ఈ సంఘటన తమ మనస్సును కలసివేసిందని అవేదన వ్యక్తం చేశారు.