క్రైమ్/లీగల్

ఇంటి దొంగల పనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 15: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో గురువారం ఉదయం జరిగిన భారీ దోపిడీ కేసును నగర పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు శుక్రవారం అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు విలేఖర్లకు వివరించారు. గ్రామంలో మేకా కమల ఇంట్లో ముగ్గురు యువకులు ప్రవేశించి ఆమెను తాళ్లతో బంధించి, గాయపర్చడంతో పాటు బీరువాలో ఉన్న 75 లక్షల రూపాయల నగదు, 26 సవర్ల బంగారు ఆభరణాలను ముగ్గురు యువకులు అపహరించి పరారయ్యారు. అర్బన్ జిల్లా ఎస్‌పి సిహెచ్ విజయారావు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగిన సూచనలు, ఆదేశాలిచ్చారు. తెలిసిన వారి ప్రమేయం ఉందనే నిర్ధారణకు వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు విద్యానగర్ 3/7వ లైనులో నివశిస్తున్న చింతలచెరువు రాజు ఇంట్లో కమల కోడలు మేకా శివపార్వతి, కోడలి అక్క లక్ష్మీప్రసన్న, ఆమె బంధువైన వంగా సీతారామిరెడ్డి, అతని తండ్రి వెంకటరెడ్డి, చింతలచెరువు రాజు పథకం ప్రకారం చోరీకి వ్యూహరచన చేసినట్లు గుర్తించామని ఎస్‌పి వివరించారు. చెంబేటి మల్లికార్జునరావు, అతని బావమరిది తోట గోపీచంద్ సమావేశమై డబ్బుల పంపిణీ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో సిసిఎస్ పోలీసులు, తాడేపల్లి ఇన్‌ఛార్జి సిఐ నిందితులను దాడి చేసి అరెస్ట్ చేశారు. వెనిగండ్లలోని లక్ష్మీ ప్రసన్న ఇంట్లో రెండుసార్లు సమావేశమై పొలం అమ్మగా వచ్చిన నగదు 2 కోట్ల రూపాయలు, బంగారు ఆభరణాలు ఉన్నాయని, ఇంట్లో కమల మాత్రమే ఉంటోందని నిర్ధారించుకుని గత 10 రోజుల నుండి అవకాశం కోసం ఎదురుచూశారు. ముందుగా నిందితుడు మల్లికార్జునరావు, సాయి, గోపిచంద్‌లను నరసరావుపేట నుండి గుంటూరు రప్పించి రాజు ఇంట్లో మకాం వేయించారు. అవకాశం వచ్చిన వెంటనే కమల కోడలు శివపార్వతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సీతారామిరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. తన భర్త, మామ వేమారెడ్డి పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, పిల్లలు స్కూల్‌కు వెళ్లారని, ఇంట్లో తాను, తన అత్తమాత్రమే ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీంతో నిందితులు కమల ఇంటి వద్దకు వెళ్లి దోపిడీచేసి కమలను బంధించడంతో పాటు పరారీలో వాహనాల మార్పు చేసుకుంటూ, అనుకున్న ప్రకారం మల్లిఖార్జునరావు, సాయి, గోపిచంద్, సీతారామిరెడ్డి దొంగిలించిన బ్యాగ్‌ను తీసుకుని గుంటూరు విద్యానగర్ 3వ లైనులోని రాజు ఇంటికి వచ్చారు. డబ్బులు మొత్తం రాజు ఇంట్లో ఉంచి ఒక ముద్దాయ సాయికి అవసరమని 22.80 లక్షల రూపాయలను అతనికి ఇచ్చి అక్కడి నుంచి పంపించివేశారు. మిగిలిన డబ్బులను పంచుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 55.20 లక్షల నగదును, 210 గ్రాముల బంగారు ఆభరణాలను మొత్తం 62 లక్షల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందని ఎస్‌పి వివరించారు. నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు నలుగురు డిఎస్‌పిలు, ఆరుగురు సిఐలు, 8 మంది ఎస్‌ఐలు, 50 మంది పోలీసు కానిస్టేబుళ్లను నియమించామని వివిధ ప్రాంతాల్లో అనుమానితులను ప్రశ్నించిన అనంతరం ఇంటిదొంగల పనేనని గుర్తించి దాడులు నిర్వహించినట్లు తెలిపారు.