క్రైమ్/లీగల్

అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాల పునరుద్ధరణకు సంబంధించిన కేసులో అసెంబ్లీ కార్యదర్శికి, న్యాయ శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణకు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహాచార్యులును, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావును ఆదేశిస్తూ, కేసును వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. తమ శాసన సభ్యత్వాలను అకారణంగా రద్దు చేశారని కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లోగడ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును పరిశీలించిన సింగిల్ జడ్జి వారిరువురి సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా స్పీకర్‌ను, అసెంబ్లీ కార్యదర్శిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించి తోసిపుచ్చింది. కాబట్టి హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి ప్రభృతులు ఇటీవల స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కలిసి కోరారు. అయినా స్పీకర్ స్పందించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టులో దాఖలు చేశారు. మరోవైపు రాష్టప్రతిని కలసి కోరాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.