క్రైమ్/లీగల్

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వారావుపేట, ఫిబ్రవరి 18: మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన పరివి రాంరెడ్డి (68) వృద్ధుడు టిప్పర్ ఢీకొనడంతో ఆదివారం మృతిచెందాడు. గ్రామసమీపంలోని బ్రిడ్జి వద్ద నిలబడివున్న రాంరెడ్డిని అశ్వారావుపేట నుండి కొత్తూరు వైపు వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో రెండు కాళ్ళు విరిగిపోయి తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108ద్వారా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యులచే ప్రధమ చికిత్స నిర్వహించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.