క్రైమ్/లీగల్

విషం తాగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, జూన్ 18: కరీంనగర్ రూరల్ మండలంలోని చేగుర్తికి చేందిన బెజ్జి రాజయ్య (55) అనే వ్యక్తి ఆదివారం రాత్రి విషం తాగి మృతి చేందినట్లు రూరల్ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సీఐ వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా కిడ్ని సంబందిత వ్యాధితో పడుతూ మనస్థాపం చేంది విషం తాగి అత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

వృద్ధుడి ఆత్మహత్య
తిమ్మాపూర్, జూన్ 18: తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామపరిధిలోని సాయబుపల్లికి చెందిన దుర్గం రాజయ్య (75) వృద్ధుడు సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నల్లగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని సాయబుపల్లికి చెందిన దుర్గం రాజయ్యకు గత ఏడాది నుండి చర్మవ్యాధి రాగా కుటుంబ సభ్యులు కరీంనగర్‌లో చికిత్స చేయిస్తున్నారు. చర్మవ్యాధితో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య దుర్గం గణమ్మ ఫిర్యాదు మేరకు ఎల్‌ఎండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
తిమ్మాపూర్, జూన్ 18: మండలంలోని ఎల్‌ఎండీ కాలనీ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ షేఖ్ అహ్మద్ (24) మృతి చెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌లో ఖార్కానగడ్డకు చెందిన షేఖ్ అహ్మద్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ నుండి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి ఆటో కిరాయికి వచ్చాడు. ఏపీ 15టిసి 1920 నంబర్ గల ఆటోలో తిరిగి కరీంనగర్‌కు వస్తుండగా రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్‌ఎండి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.

21 మంది మందు బాబులకు జైలు శిక్ష, జరిమానా
ముకరంపుర కరీంనగర్, జూన్ 18: మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 21 మంది మందు బాబులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో సోమవారం న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. ఈ 21 మంది మందు బాబులకు 47,500 రూపాయల జరిమానా విధించారు.