క్రైమ్/లీగల్
లారీ ఢీకొని ఒకని మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 February 2018
కోవూరు, ఫిబ్రవరి 18: నందలగుంటకు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కావలి నుండి నెల్లూరు వైపు వెళుతున్న లారీని మోటార్ సైకిలిస్టు వెనుక వైపు నుంచి ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన ఎస్ ఏడుకొండలుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారులు సంతోష్, సంధ్యలను నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ఎస్‌ఐ అలహరి వెంకట్రావ్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.