క్రైమ్/లీగల్

ఓబులక్కపల్లి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దారవీడు, ఫిబ్రవరి 18: మండలంలోని ఓబులక్కపల్లి గ్రామసమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పెద్దారవీడు ఎస్సై పి ముక్కంటి ఆదివారం తెలిపారు. పొలాల్లోని కాలువలో మృతదేహం పడి ఉందని, అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించామని, అయితే ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించామని తెలిపారు. కాగా ఈ మృతుడు భిక్షగాడని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తోందని అన్నారు.