క్రైమ్/లీగల్

డీబారైనందుకు పీజీ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 19: పరీక్షల్లో మాస్‌కాఫీయింగ్‌కు పాల్పడుతూ ఇన్విజిలెటర్‌కు పట్టుబడి డిబారైనందుకు మనస్థాపం చెందిన పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఖేడ్ ఎస్‌ఐ నరేందర్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాణాపురం గోరఖ్‌నాథ్ (23) మెదక్ జిల్లా మండల కేంద్రమైన నర్సాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం నాడు పరీక్షకు హాజరైన గోరఖ్‌నాథ్ మాస్‌కాఫీయింగ్‌కు పాల్పడుతుండగా ఇన్విజిలెటర్ పట్టుకుని డిబార్ చేశాడు. సోమవారం సాయంత్రం తన స్వగ్రామానికి చేరుకున్న విద్యార్థి రాత్రి భోజనం చేసి 11 గంటల ప్రాంతంలో నిద్రపోయాడు. మంగళవారం ఉదయం కుటుంబీకులు లేచేసరికి గోరఖ్‌నాథ్ ఇంట్లో కనిపించలేదు. కుటుంబ సభ్యులు వెతకగా వారి స్వంత పొలం వద్ద ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని శవమై కనిపించాడు. కుటుంబీకులకు అనుమానం వచ్చి నర్సాపూర్‌లోని తోటి విద్యార్థులకు ఫోన్ చేసి వాకబ్ చేయగా డిబార్ అయ్యాడని సమాదానం ఇచ్చారు. మృతుడి తండ్రి అంజయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. గోరఖ్‌నాథ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఇన్విజిలెటర్ షర్ట్ విప్పించి తోటి విద్యార్థుల ముందు అవమానపర్చడమే కారణమని నర్సాపూర్‌లో విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు అసౌకర్యాలకు నిలయమైన పీజీ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేసారు.

కోడి పందాల స్థావరంపై దాడి
పటాన్‌చెరు, జూన్ 19: కోడి పందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి జరిపారు. ఇంద్రేశం, రామేశ్వరంబండ గ్రామ శివారులలో కొనసాగుతున్న కోడి పందాల నిర్వాహకులపై స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో కోడి పందాలు ఆడుతున్న 15 మంది జూదరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, 14 బైకులు అదుపులోకి తీసుకున్నారు. కోడి పందాలు నిర్వాహకులు ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు స్థానిక సిఐ నరేష్ మంగళవారం సాయంత్రం నిర్వహించిన పత్రికా విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి అధ్వర్యంలో గ్రామ శివారులలో దాడులు జరిగాయి. వీరిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.