క్రైమ్/లీగల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఫిబ్రవరి 4: మండల పరిధిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా మారి ఇద్దరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. నాయుడుపేట నుంచి బియ్యం మినిలారీ తిరుపతికి వస్తోంది. మార్గం మధ్యలో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకొని తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ కాళహస్తి-రేణిగుంట జాతీయ రహదారిలో గుత్తివారి పల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుకవైపునుంచి బియ్యం లారీ ఢీంది. అందులో ప్రయాణం చేస్తున్న పూర్ణచంద్రారెడ్డి (57) అక్కడికక్కడే మృతిచెందగా శ్రీనివాసులురెడ్డిని చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. అలాగే మండల పరిధిలోని కరకంబాడి పంచాయతీ గొల్లపల్లి గ్రామం రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు మోటార్‌బైక్‌లో గట్టుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కల్వర్టులో పడిపోయారు. ఈ సంఘటనలో నారాయణ (26) అక్కడికక్కడే మృతిచెందగా మాధవ అనే యువకుడు ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మోహన్ అనే యువకుడికి స్వల్పగాయాలై రుయాలో చికిత్స పొందుతున్నాడు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.