క్రైమ్/లీగల్

అంతర్ జిల్లా దొంగల ముఠాల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జూన్ 21: ప్రయాణీకుల్లా నటిస్తూ బస్సుల్లో బ్యాగులను చోరీ చేయటంతోపాటు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే రెండు వేర్వేరు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో దొంగతనానికి పాల్పడిన 45 తులాల బంగారం నగలను, 30 తులాల వెండిని స్వాధీనం చేసుకోన్నామన్నారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందన్నారు. గురువారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ఇస్మాయిల్ పాల్గొన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరందరూ పాత నేరస్థులేనన్నారు. ప్రధానంగా ప్రయాణీకులను ఏమార్చి వారి బ్యాగులను తస్కరించటంలో సిద్ధహస్తులన్నారు. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మహిళ దొంగలు ఉన్నారన్నారన్నారు. వీరంతా రక్త సంబంధీకులేనని ఆయన తెలిపారు. బస్సుల్లో ప్రయాణీకుల తరహా నటిస్తూ తోటి ప్రయాణీకుల్లో కలిసిపోతారన్నారు. అదును చూసి బ్యాగులను లిఫ్ట్ చేయటం, లేదా బ్యాగుల్లోని పర్సులను చాకచక్యంగా చోరీ చేస్తారన్నారు. ఈ తరహా చోరీలు జిల్లాలోని గుత్తి, ఓబుళదేవరచెరువు, కదిరి, అనంతపురంలో పాల్పడటం జరిగిందన్నారు. వీరిలో మేకల లక్ష్మిపై ఉరవకొండ, వజ్రకరూరు పోలీస్ స్టేషన్లలో పాత కేసులు ఉన్నాయన్నారు. రాత్రిళ్లు ఇళ్ల దొంగతనాలకు పాల్పడే ముఠాలలో షికారి రవి ముఖ్యుడు అన్నారు. ఇతను అంతర్రాష్ట్ర దొంగ తెలిపారు. ఇతని సూచనలతోనే మరో నిందితుడు షికారి జవారి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారన్నారు. గుర్తించిన అనంతరం అదే రోజు రాత్రి వీరంతా కలిసి దొంగతనాలకు పాల్పడటం జరగుతుందన్నారు. ఇవే కాకుండా షికారి రవిపై కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, జడ్చర్ల, పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో కేసులు ఉన్నాయన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు బస్సుల్లో చోరీలు చేసే ముఠాలతోపాటు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీ చేసే ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించటం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే తన ఆధ్వర్యంలో సీఐ ఇస్మాయిల్‌తోపాటు కదిరి ఎస్‌ఐ హేమంత్‌కుమార్, గుత్తి ఎస్‌ఐ వలీబాషా, మరికొందరు పోలీసులతో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ రెండు ముఠాలను వేర్వేరుగా అరెస్టు చేయటం జరిగిందన్నారు.