క్రైమ్/లీగల్

ఆన్‌లైన్ షేర్ మార్కెట్ పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 21: నేను నిరుద్యోగిని.. ఉద్యోగం లేదని బాధపడడం లేదు. ఆన్‌లైన్ షేర్ మార్కెట్‌లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టాను. ఇప్పడు లక్షలు సంపాదిస్తున్నాను అంటూ అన్‌లైన్‌లో వచ్చే ప్రచారాలను చూసి యువత మోస పోతుంది.
అన్‌లైన్ మోసాగాళ్ల భారినపడి మోస పోతున్నది ఎదో చదువురాని నిరుద్యోగులు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఉన్నత చదువులు చదివిన వారే కావడం విశేషం. రాజేంద్రనగర్‌కు చేందిన శే్వత అనే మహిళ ఇలాంటి మోసాగాళ్లతో లక్షల రూపాయలు మోసపోయింది. వచ్చిన లాభం పంపించమంటే నిందితుల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో తను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షేర్ మార్కెట్ పేరుతో మాసాలకు పాల్పడుతున్న నాలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 13లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోనిందితుల వివరాలను పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. మహారాష్టల్రోని సూరత్‌కు చెందిన షానావాజ్ అబ్దుల్ రహిమాన్ (26) ఆలోక్ పవార్ (25) నికేట్ శెట్టి (26) నవాజ్ ఆన్సారీ (24)లు ముఠాగా ఏర్పడి నకిలీ ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ పేర్ మార్కెట్ మోసాలకు పాల్పడుతున్నారు. డెటాబెస్ ఇండియా సంస్థ నుంచి షేర్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టె కస్టమర్ల వివరాలను సేకరించి నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ వెల్లడించారు. తమ ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో డబ్బు పెట్టుబడి పెడితేన వారికి లక్షల రూపాయలు లాభాలు వస్తున్నాయని ప్రచారం చేయడంతో పాటు రోజుకు 40వేల మందికి మెసేజ్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈముఠా ముంబాయి కేంద్రంగా కాల్ సెంటర్‌ని ఏర్పాటు చేసుకుని మోసాలు చేస్తున్నారని వివరించారు.
శే్వత మొదట లక్ష 92వేలు పెట్టుబడి పెట్టాగా డబ్బును హవాల ఏజెంట్ ద్వారా పంపించింది. కొద్ది రోజులకు రూ.7.20లక్షల వచ్చినట్లు చూపించిన నిందితులు మరుసటి నెలలో రూ.1.18లక్షల పైచిలుకు వచ్చినట్లు చెప్పాడంతో కొంత డబ్బు తీసుకొవాడానికి ప్రత్నించగా నిందితులు లావాదేవీలు చేసిన ఫోన్ నెంబర్‌తో పాటు వెబ్‌సైట్ బంద్ కావడంతో మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు షానవాజ్ బీకాం వరకు చదువుకుని కొన్ని రోజులు ముంబయిలో షేర్ మార్కెట్‌లో పని చేశాడని సీపీ తెలిపారు. నాలుగురు నిందితులకు షేర్ మార్కెట్ అవగహన ఉండడంతో మూడు సంవత్సరాల నుంచి ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ పేరుతో మోసాలు చేస్తున్నారని చెప్పారు. ఈ ముఠా ఇప్పటి వరకు 120 మంది నుంచి దాదాపు ఐదు కోట్ల రూపాయలు మోసం చేసిందని సీపీ తెలిపారు. నిందితుల నుంచి 13లక్షల రూపాయల నగదు, 13 సెల్‌ఫోన్లులు, ఒక లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన క్రైం డీసీపీ జానకీ శర్మిల బృందం ఏసీపీ శ్రీనివాస్, సీఐలు నవీన్ రెడ్డి, శ్రీనివాస్, ఎస్‌ఐ విజయ్ వర్ధన్, సిబ్బంది సిద్దేశ్వర్, నందు యాదవ్, భరత్‌ని సీపీ అభినందించారు.