క్రైమ్/లీగల్

జక్కంపూడి కాలనీలో వ్యభిచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూన్ 21: ఇష్టంలేని పెళ్లి నరకం నుండి తప్పించుకుని విజయవాడకు పరారై వచ్చిన ఓ యువతి వ్యభిచార గృహంలో బందీ అయింది. ఏడాది పాటు నకరం అనుభవించిన బాధితురాలు గురువారం ఉదయం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నామాలపాడు గ్రామానికి చెందిన ఈసం మధుమతి(19) తండ్రి అటవీ శాఖలో పనిచేసేవాడు. గంధం చెక్కల స్మగ్లర్లు ఆయన మెడ కోసి హతమార్చారు. ఆ వార్త విన్న తల్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను కోల్పోయిన మధుమతిని పెదనాన్న చేరదీశాడు. పెద్ద వయస్సున్న వ్యక్తితో గత ఏడాది జూన్ 27న బలవంతంగా ఇష్టంలేని పెళ్లి జరిపించాడు. అదేరోజు రాత్రి పెళ్లి చదివింపుల్లో వచ్చిన రూ. 40వేలు, ఒంటిపై వున్న రూ. లక్ష విలువైన బంగారు ఆభరణాలతో ఇంటి నుండి పరారై ఆమె బెజవాడ రైలెక్కింది. బెజవాడ రైల్వేస్టేషన్‌లో దిగిన మధుమతి ఎటువెళ్లాలో తోచక నడుచుకుంటూ బస్టాండ్‌కు వస్తుండగా ఓ ఆటోడ్రైవర్ తారసపడ్డాడు. మాయమాటలతో జక్కంపూడి కాలనీకి తరలించాడు. రూ. 20వేలకు వంగర శోభారాణి అనే మహిళకు ఆమెను అప్పగించాడు. నాటి నుండి శోభారాణి, ఆమె భర్త నారాయణమూర్తిలు మధుమతిని వ్యభిచార గృహాలకు తరలించారు. ఆ క్రమంలో గుంటూరులో మధుమతి 7 నెలలు పడుపువృత్తిలో కొనసాగింది. తన దారి తాను చూసుకుంటానని వ్యభిచార నిర్వాహకులను కోరింది. ఇప్పటి వరకు తనకు రావాల్సిన నగదు, ఆనాడు తాను తెచ్చిన నగదు, బంగారం మొత్తం ఇవ్వాలని వేడుకుంది. అందుకు వారు ససేమిరా అనడంతో మహిళా మండలి పేరిట కొందరు మహిళలు సెటిల్మెంట్ చేయడానికి రంగంలో దిగారు. అయినా వారు మధుమతికి న్యాయం చేయలేకపోయారు. దాంతో బాధితురాలు స్థానిక మహిళల సాయంతో గురువారం కొత్తపేట పోలీసులను ఆశ్రయించడంతో వ్యభిచార గృహం గుట్టు రట్టయ్యింది. పోలీసులు రంగంలోకి దిగారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న దంపతులను, వారికి అమ్మాయిలను చేరవేస్తున్న ఆటోవాలాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసును వెస్ట్‌జోన్ ఏసీపీ కే సుధాకర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. కొత్తపేట సీఐ జే మురళీకృష్ణ, ఎస్‌ఐలు తిరుపతిరావు, మూర్తి సుబ్రహ్మణ్యం ఈ వ్యభిచార గృహంలో చిక్కుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. సెల్‌ఫోన్ డేటా ప్రకారం నిందితులు ఏఏ ప్రాంతాలకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారో వివరాలు రాబడుతున్నారు. కేవలం నగదు లావాదేవీల్లో విభేదాల వల్ల గుట్టు రట్టయ్యింది. కాలనీలోని 205 బ్లాక్ జీఎఫ్ 8 నెంబర్ ఇంట్లో ఈ వ్యభిచారం సాగుతోంది. కాలనీలో ఆకస్మిక తనిఖీలు, స్ట్రీట్‌వాక్‌లు నిర్వహించినా వ్యభిచార గృహాన్ని మాత్రం పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.