క్రైమ్/లీగల్

భృగుబండలో నకిలీ బంగారం ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూన్ 21: ఇనుపకడ్డీకి బంగారు పూతపూసి సినీఫక్కీలో బంగారం దొంగిలించే ముఠా కోసం పోలీసులు సత్తెనపల్లి మండల పరిధిలోని భృగుబండ గ్రామాన్ని గురువారం జల్లెడ పట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లి పరిసర ప్రాంతాలే కేంద్రంగా మాయ మాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నదొంగ బంగారం ముఠాను ఛేదించే క్రమంలో పోలీసు అధికారుల సమక్షంలో విసృత తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సోదా చేసి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నకిలీ బంగారు ఆభరణాలను, మారణాయుధాలను స్వాధీనపరచుకున్నారు. ఈ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తారు. అక్కడ అమాయక మహిళలే లక్ష్యంగా వాళ్ల వద్ద ఉన్న బంగారు పూత అద్దిన కడ్డీలను ఇచ్చి అసలు బంగారాన్ని దొంగిలిస్తారు. ఇలా దొంగిలించిన బంగారాన్ని స్వర్ణ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. గతంలో ఈ కేసులను పరిశీలించిన జిల్లాపోలీసులు సత్తెనపల్లి ప్రాంతంలోని వారేనని గుర్తించి పూర్తి స్థాయి సమాచారం అనంతరం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిని, ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా రూరల్ సిఐ వీరయ్య చౌదరి మాట్లాడుతూ .. ప్రజలు అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకోవద్దని సూచించారు. అనుమానితులు కనబడితే నేరుగా సమాచారం ఇవ్వాలని వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. బంగారం అమ్ముతామంటూ వచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో పిడుగురాళ్ళ సిఐలు హనుమంతరావు, సుబ్బారావు, సత్తెనపల్లి సిఐలు వీరయ్యచౌదరి, శరత్‌బాబు, క్రోసూరు, అచ్చంపేట, ముప్పాళ్ళ, బెల్లంకొండ ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.