క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూన్ 21: రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన సంఘటన గురువారం పటన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్థానిక పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పటన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పర్వతనేని మోహన్‌రెడ్డి(45) మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతిలో గల సిటిజన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే బుధవారం ఉదయం డ్యూటికి వెళ్లిన మోహన్‌రెడ్డి విధులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. బైక్ నంబరు ఎపి 23ఎఎ 7491 గల దానిపై ఇంటికి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3.10 గంటలకు ఇంద్రేశం గ్రామ శివారులలోని సిటిజన్ కాలనీ ఎంట్రన్స్ వద్ద పెద్దవాగు బ్రిడ్జిపై ఆగి ఉన్న టిప్పర్ టిఎస్ 15 యుసి 3412 నంబరు గల దానిని వెనుక నుండి ఢీ కొట్టాడు. ఎలాంటి సిగ్నల్స్ లేకుండా అజాగ్రత్తగా టిప్పర్‌ను రోడ్డుపైనే నిలపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలియచేసారు. టిప్పర్‌ను ఢీ కొట్టడంతో మోహన్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలైనాయి. దీనితో చికిత్స నిమిత్తం హుటాహుటిన అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు.