క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూన్ 21: ఉదయం నుండి తీవ్ర ఎండ ఉక్కపోతతో జనజీవనం ఉక్కిరిబిక్కిరికాగా సాయంత్రం ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వర్షం అన్నదాతను ఆనందపరిచగా పిడుగుపాటుకు రైతు మృతి చెందగా, చలిపిడుకు గేదె మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం మెదక్‌తోపాటు గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. వర్షంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగనున్నాయి. వర్షం కురుస్తున్న సమయంలో భారీ ఆకాశంలో మెరుస్తు పెద్దశబ్దం ఏర్పడింది. ఈ సమయంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. మెదక్ మండలం కోంటూరుకు చెందిన రైతు మెండె మానయ్య(55) పశువులను తీసుకొని మేతకు తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. భారీ శబ్దంతో పిడుగు పడడంతో మానయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య మల్లమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. కుటుంబ సభ్యులను ఎంపీపీ అధ్యక్షురాలు లక్ష్మీకిష్టయ్య, సొసైటీ డైరెక్టర్ మార్గం యాదగిరిలు పరామర్శించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబీకులు కోరారు.