క్రైమ్/లీగల్

ఎస్సైకు రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, జూన్ 22: ఆలమూరు మండలంలో 2003 సంవత్సరంలో ఇటుక బట్టీలో పనిచేసే నక్కా లక్ష్మణరావును అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణపై అప్పటి ఎస్సై రవితేజకు రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ ఆలమూరు కోర్టు న్యాయమూర్తి హెచ్ అమరరంగేశ్వరరావు తీర్పు చెప్పారు. ఇటుక బట్టీ యజమాని చల్లా ప్రబాకరరావు, ఎస్సై రవితేజ, కానిస్టేబుళ్లు కృష్ణారెడ్డి, కొండలరావు కేసు నమోదు చేయకుండా అక్రమంగా నిర్భందించి, హింసించగా లక్ష్మణరావు కేసు నమోదు చేయించగా అప్పటి నుండి స్థానిక కోర్టులో వాదోపవాదనలు విన్న అనంతరం నేరారోపణ రుజువైనందున న్యాయమూర్తి నిర్భందానికి కారణమైన ఇటుక బట్టీ యజమాని చల్లా ప్రబాకరరావుకు మూడేళ్ళ, ఒక్కొక్క కానిస్టేబులుకు ఏడాది జైలు శిక్షతో జరిమానా విదిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు.