క్రైమ్/లీగల్

ఆటో ప్రమాదంలో ఉపాధి కూలీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.కోడూరు, జూన్ 23: మండల పరిధిలోని మేకవారిపల్లిలో ఆటో ప్రమాదం జరిగి పందిటి వెంకటసుబ్బమ్మ (50), పందిటి ఆదిలక్షుమ్మ (30) అనే ఇద్దరు మహిళలు మృతిచెందడంతో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకెళ్తే... మేకవారిపల్లె ఎస్‌సికాలనీకి చెందిన ఉపాధి కూలీలు శనివారం గ్రామానికి సుమారు 6 కి.లో.మీటర్లు దూరం గల అటవీ ప్రాంతంలోకి ఏపి04 టిడబ్ల్యూ 6013 నెంబరు గల ఆటోలో పనిచేసేందుకు వెళ్లారని పనిని ముగించుకుని తిరిగి వస్తుండగా 10.45 నిమిషముల ప్రాంతంలో బద్వేలు-పోరుమామిళ్ల రోడ్డు నుండి మేకవారిపల్లె రోడ్డులో కూలీలతో కూడిన ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగినట్లు బి.కోడూరు ఎస్‌ఐ మద్దిలేటి తెలిపారు. మృతి చెందిన వారిని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, గాయపడిన వారిని మెరుగైన వైద్యంకోసం కడప రిమ్స్‌కు పంపినట్లు తెలిపారు. కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ అదనపు పిడి మొగిలిచెంద్ సురేష్ మృతులకు పూలమాలలువేసి బంధువులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయంగా మృతులకు ఏపివో, ఎండీవో 2000 రూపాయలు ఖర్చుల నిమిత్తం అందజేశారని త్వరలో ఉపాధిహామీ తరుపున మృతులకు 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎంపీడీవో మల్లయ్య, తహసీల్దార్ దుగ్గిరెడ్డి, ఏపిడి బ్రహ్మానందరెడ్డి, ఏపివో నాగిరెడ్డి మృతులను దర్శించి బంధువులను పరామర్శించారు.