క్రైమ్/లీగల్

రేషన్ బియ్యం లారి పట్టివేత-ఆరుగురు నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, జూన్ 23: దాచేపల్లిలో అక్రమంగా తరలి వెళుతున్న 240 బస్తాల లోడ్‌గల రేషన్ బియ్యం లారిని శనివారం పోలీసులు పట్టుకొని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు 2.76లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు కథనం ప్రకారం రేషన్ బియ్యం లోడ్ లారి బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్ళిపోతుందన్న సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని వీరాపురం కాలవ వద్ద బియ్యం లారిని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి 2.76 లక్షల నగదను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈమేరకు దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.