క్రైమ్/లీగల్

కర్నూలు-నంద్యాల రహదారి రక్తసిక్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 24 : ఓర్వకల్లు మండల పరిధిలోని సోమయాజులపల్లె గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంతో కర్నూలు-నంద్యాల ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. ఆ రహదారిపై ఓ ఆటో పరిమితికి మించి ప్రయాణికులతో రాంగ్ రూట్‌లో వెళ్తుండగా నంద్యాల నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. కోడుమూరు మండలం కల్లపారి, గూడూరు మండలం చనుగొండ్ల గ్రామాలకు చెందిన ప్రజలు పదుల సంఖ్యలో మహానందిలో ఒక నాటు వైద్యుడి వద్ద చికిత్స కోసం మూడు ఆటోల్లో బయల్దేరారు. అయితే వాటిలో వెనుక వెళ్తున్న ఆటోను సోమయాజులపల్లె వద్ద నంద్యాల డిపోకు చెందిన నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కోడుమూరు మండలం కల్లపారి గ్రామానికి చెందిన బోయ మారెప్ప(60), గౌరమ్మ(60), బోయ ఈరమ్మ(57), మాణిక్యమ్మ(46), లక్ష్మిదేవి(55), గోవిందమ్మ(62), గూడూరు మండలం చనుగొండ్లకు చెందిన లక్ష్మిదేవి(40), హుసేనమ్మ(60), వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన సోమక్క(70) దుర్మరణం చెందారు. అలాగే కల్లపారి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోయ వాసు, భగవంతు, చనుగొండ్లకు చెందిన మద్దిలేటి, సరోజమ్మ, అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే 108 వాహనం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గురైన ఆటోలో డ్రైవర్‌తో పాటు మొత్తం 14 మంది ఉండగా 9 మంది మృతి చెందారు. వారిలో కల్లపారి సర్పంచ్ గౌరమ్మ కూడా ఉన్నారు. ఆటో రాంగ్‌రూట్‌లో రావడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ముందు వెళ్లిన ఆటోలు కూడా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని లేదంటే మృతుల సంఖ్య భారీగా పెరిగేదని అభిప్రాయపడ్డారు. మృతులంతా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులేనని మహానందిలో నాటు వైద్యం చేయించుకునేందుకు వెళ్తూ మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి భారీగా చేరుకున్నారు. తమ వారు వైద్యం కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయారని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి
ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె సమీపంలో జరిగిన రహదారి ప్రమాదం గురించి ఆదివారం సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారన్న సమాచారంతో చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధితులు, క్షతగాత్రులకు అవరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీలను ఆదేశించారు.
క్షతగాత్రులకు డీఐజీ పరామర్శ
రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే మార్చురీ గదికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అక్కడ రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం డీఐజీ ప్రమాదం జరిగిన సోమయాజులపల్లెకు వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. డీఐజీ వెంట ఏఎస్పీ షేక్షావలి, ఏఆర్ ఏఎస్పీ వెంకటేష్, డీఎస్పీలు బాబుప్రసాద్, గంగయ్య, ఆర్టీఓ జగదీశ్వరరావు, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు వరప్రసాదరావు, శంకరావు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్, డీటీఆర్‌బీ సీఐ దివాకర్‌రెడ్డి, రూరల్ సీఐ పవన్‌కిషోర్, ఎస్‌ఐలు మధుసూదన్, శరత్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జున, తదితరులు ఉన్నారు.