క్రైమ్/లీగల్

16నెలల బాలికపై లైంగిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, జూన్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని తూరుబాక గ్రామంలో 16 నెలల బాలికపై ఒక యువకుడు ఆదివారం అర్థరాత్రి లైంగిక దాడికి యత్నించాడు. ఆ యువకుడిని సోమవారం మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం పట్టణానికి చెందిన భూక్యా మమత తన 16 నెలల పాపతో తూరుబాక గ్రామానికి ఒక వివాహ వేడుకకు ఆదివారం హాజరైంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆ పాపను ఆజ్మీరా సాయికిరణ్ అనే యువకుడు ఎత్తుకుంటానని తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. పాప ఏడుపు ఎంతసేపటికి ఆపకపోవడంతో లైంగిక దాడి జరిగినట్లు గుర్తించింది. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ లైంగిక దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.