క్రైమ్/లీగల్

బీసీ కోటా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలో వెనుకబడిన కులాల (బీసీ) గణాంకాల వివరాలు తేల్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబందించి బిసి రిజర్వేషన్లు శాతం ఎంత అన్నది తేల్చాలని కాంగ్రెస్ నేతలు బి రవీందర్‌నాథ్, దాసోజి శ్రవణ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు రేపోమాపో నోటిఫికేషన్ వెలువడుతుందనుకుంటున్న ప్రభుత్వ ప్రకటన వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికలపై జస్టిస్ రామచంద్రరావు ఈ పిటీషన్లపై విచారణ చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల గణాంకాల విషయంలో చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి, ఎన్నికల ప్రకటన జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో బీసీ గణాంకాలు, ఓటర్ల జాబితాపై స్పష్టత లేకుండా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పిటీషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర జనాభాలో 37 శాతం బీసీలు ఉన్నారని ఒకసారి, సకలజనుల సర్వేలో 54 శాతం బీసీ జనాభా ఉందని మరోసారి ప్రభుత్వం చెబుతూ వచ్చిందని పిటీషర్లు కోర్టుకు వివరించారు. దీంతో బీసీ జనాభా, ఓటర్లును ఏ ప్రాతిపదికన తేల్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ ఎన్నికల నోటిపికేషన్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందని కోర్టు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించగా, అందుకు ఆయన రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. ఇప్పటికే సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిందని, దీని దృష్ట్యా ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివాదాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరపున కేఎస్ మూర్తి, రచనారెడ్డి వాదించారు.