క్రైమ్/లీగల్

రైతుబంధు పిల్‌పై హైకోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 26: రైతుబంధు పథకంతో సామాన్య రైతులకంటే పెద్ద రైతులు, భూస్వాములకే అధిక లాభం జరుగుతుందని పథకంలో మార్పులు చేయాలని కోరుతు నల్లగొండ జిల్లాకు చెందిన పి.యాదగిరిరెడ్డి హైకోర్టుకు సమర్పించిన లేఖను మంగళవారం ప్రజాప్రయోజనాల వాజ్యంగా విచారణకు స్వీకరించింది. యాదగిరిరెడ్డి రైతుబంధు పథకం లబ్ధి నుండి ఎన్నారైలు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మినహాయించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని హైకోర్టును కోరారు. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తు విచారణను జూలై 10కి వాయిదా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు పథకం తొలి విడతగా ఖరీఫ్ పంటకు పెట్టుబడి సాయంగా రైతులకు రూ.4వేల సాయం అందించింది. రైతుబంధు పథకం లబ్ధిదారుల్లో ఉన్నారన్న సంగతిని ప్రభుత్వం లెక్క తేల్చాల్సి వుంది. పెద్ద రైతులకు సంబంధించి మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం రాష్ట్రంలో 25వేల ఎకరాలకుపైగా ఉన్న వారు కేవలం 6480మంది రైతులే ఉన్నట్లుగా తెలిపారు. అయితే కుటుంబాల వారీగా చూస్తే కుటుంబ పెద్దతో పాటు ఆ కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న భూమిని లెక్క తీసుకుంటే మరింత మంది వెలుగులోకి వచ్చే అవకాశముంది. అటు గ్రామా ల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ సందర్భంగా కార్లలో వచ్చిన పట్టాదారులు, 50వేల నుండి లక్షకుపైగా చెక్కులు తీసుకున్న రైతులు అనేక మంది కనిపించారని దీంతో సన్న, చిన్నకారు కంటే ఎక్కువ భూమి ఉన్న సంపన్నవర్గాల వారికే అధిక లాభం జరిగిందన్న వాదన వినిపించింది. అటు కౌలురైతుకు సైతం రైతుబంధు సహాయం దక్కకపోవడం లోటుగా కనిపించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం రైతుబంధు పథకంలో మార్పులపై ఆలోచన చేయాలన్న వాదన రైతు సంఘాల్లో వినిపిస్తుంది.