క్రైమ్/లీగల్

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28; ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఒక వారంలోగా ఏర్పాటు చేయాలని, మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో సంబంధిత పరిపాలనను సాగించే విధంగా ప్రకటన చేయాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదోన్నతల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఏపీ ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్, జస్టిస్ ఉమాదేవితో కూడిన బెంచ్ ఇంజనీర్ల పిటిషన్‌పై విచారించింది. ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి, ఇరిగేషన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ తమకు మెమోలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చాలా కాలం నుంచి ఖాళీగా ఉందని కోర్టు దృష్టికి పిటిషనర్ తరపున పివి కృష్ణయ్య తెలిపారు.