క్రైమ్/లీగల్

ఇద్దరు ఐటీ అధికారులకు ఐదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి: అవినీతి కేసులో ఆదాయం పన్ను శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. 2010లో ఈ ఇద్దరు అధికారులు 1.7 కోట్ల సొమ్మును ముట్టచెప్పాలంటూ ఒక బిల్డర్‌ను బెదిరించినట్లు సిబిఐ అభియోగాలు మోపింది. శిక్ష పడిన వారిలో అదనపు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు. ఈ కేసులో అదనపు కమిషనర్ భర్తకు కూడా కోర్టునాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ, సీబీఐ కోర్టు న్యాయమూర్తి వివేక్ కథారే తీర్పు ఇచ్చారు. అదనపు కమిషనర్ సుమిత్రా బెనర్జీ 1992 ఇండియన్ రెవెన్యూ సర్వీసు బ్యాచ్‌కు చెందిన వారు. అసిస్టెంట్ కమిషనర్ అంజలి బాంబోలేతో కలిసి అదనపు కమిషనర్ ఈ కేసులో థానేకు చెందిన బిల్డర్‌ను రూ.1.7 కోట్ల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అదనపు కమిషనర్ భర్త సుబ్రతోను సీబీఐ వల పన్ని పట్టుకుంది. ఈ కేసులో అదనపు కమిషనర్ సుమిత్రా బెనర్జీకి రూ. 80లక్షలు, అసిస్టెంట్ కమిషనర్‌కు రూ.30 లక్షలు, సుమిత్రా భర్తకు రూ. 40 లక్షల జరిమానాను విధించారు. ఆస్తులకు సంబంధించి సోదాలను దర్యాప్తు కేసుగా మార్చకుండా ఉండేందుకు బిల్డర్‌ను లంచం అడిగారని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. తనను లంచం అడుగుతున్నారంటూ బిల్డర్ సీబీఐను 2010 ఏప్రిల్ 12వ తేదీన ఆశ్రయించాడు. పైన శిక్షపడిన ఇద్దరు అధికారుల గురించి ఫిర్యాదు చేశారు. ఆదాయం పన్ను భారం తగ్గించాలని కోరినందుకు తనను రూ.1.7 కోట్ల లంచం అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు నమోదైన వెంటనే బాధ్యులైన అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో సీబీఐ 14 మంది సాక్షులను విచారించింది.