క్రైమ్/లీగల్

అప్పుల భారంతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూన్ 28: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శివాజీ చౌహన్ (48) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు మండలం హస్నాపూర్ పంచాయతీ పరిధిలోని శ్యాంనాయక్ తాండాకు చెందిన శివాజీ 1990 బ్యాచ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికై అనంతరం పోలీసు విభాగంలోని ఐటికోర్ ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవలే ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందారు. తన స్నేహితులకు ఇచ్చిన అప్పు తిరిగివచ్చే అవకాశాలు లేకపోవడం, మరో మిత్రుడు రూ. 50 లక్షలపైన అప్పు పొందగా శివాజీ పూచికత్తు కింద జామీను పత్రాలు రాసివ్వడంతో అప్పుల భారం అధికం కావడం, వచ్చే జీతం కూడా కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో నాలుగు రోజులుగా మానసికంగా కుంగిపోయి గురువారం ఉదయం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచన మేరకు వెంటనే అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యంలోనే డిచ్‌పెల్లి వద్ద సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు శాఖలో అంకితభావంతో పనిచేస్తూ పలుమార్లు అవార్డులు పొందిన శివాజీ ఆత్మహత్య కలచివేసిందని ఎస్పీ పేర్కొన్నారు. కాగా శివాజీకి భార్య ముగ్గురు పిల్ల లు ఉండగా అంత్యక్రియలు శుక్రవా రం ఉదయం తన స్వగ్రామంలోని హస్నాపూర్‌లో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.