క్రైమ్/లీగల్

మెడిసిన్ సీట్ల పేరిట మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: దేశ, విదేశాల్లో పేరొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మెడిసిన్‌లో ఎంబిబిఎస్, ఎండి కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు భారీ మోసానికి తెరదీశారు. ఇండియా, నేపాల్, తదితర దేశాల్లో డీమ్డ్ యూనివర్శిటీలు, టాప్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద మెడిసిన్ సీట్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి రూ.81 లక్షలు, ఢిల్లీలో రూ.68 లక్షలు వసూలు చేశారు. మిగిలిన ప్రాంతాల్లోనూ మోసాలకు పాల్పడ్డంపై ఇంకా విచారణ జరుగుతోంది. ఈ కేసును హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ సిపి అంజనీకుమార్, నగర క్రైం బ్రాంచ్ అదనపు సిపి, డిసిపి అవినాశ్ మహంతి తదితరులు గురువారం నాడిక్కడ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితులు సంతోష్‌కుమార్ రాయ్, మనోజ్‌కుమార్ పాఠక్ ఇద్దరూ ఢిల్లీ వాసులే. వీరిని అరెస్టు చేసి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లు, నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు వంటివి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఫాతిమా రజ్వీ మొబైల్ నెంబర్‌కు ఇటీవల ఒక ఎస్‌ఎంఎస్ అందింది. ఆ మెసేజ్ సారాంశం ఇలా ఉంది..‘పిజి 2018 మెడికల్ సీట్లు ఇండియా, నేపాల్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటాలో పేరొందిన డీమ్డ్ యూనివర్శిటీల్లో ఉన్నాయి, అవసరమైతే వివరాలకు డాక్టర్ ఆర్‌ఎస్ యాదవ్ సెల్ నెంబర్ 8795520763’ని సంప్రదించాలని ఉంది. అప్పుడామె తన కుమార్తెకు ఎండి సీటు కావాలని ఆ నెంబర్‌కు సంప్రదించారు. బెంగళూరు, మైసూరు, బళ్లారిలో ఉన్న కాలేజీల్లో సెంట్రల్ పూల్ కోటా కింద సీటు ఇప్పిస్తామని అవతలి వైపు నుంచి చెప్పారు. ముందు రూ.5 వేల మొత్తాన్ని డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ పేరుతో డిడి తీసి అందజేయాలని తెలిపారు. ఆ తర్వాత రూ.10 లక్షలు ఒకసారి, రూ.20 లక్షలు ఒకసారి వాయిదాల పద్దతిలో తీసుకున్నారు. ఆ తర్వాత మెడికల్ సీటు ఆశించిన విద్యార్థిని మెయిల్‌కు ఒక మెయిల్‌ను పంపించారు. సీటు అలాట్‌మెంట్ చేసినట్లు ఆర్డర్ కాపీని ఆ మెయిల్‌తో పంపడంతో పూర్తిగా నమ్మారు. బళ్లారిలోని విజయనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో సీటు వచ్చిందని, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఎండి డెర్మటాలజీ సీటు వచ్చిందని నిర్ధారించారు. ఇలా మొత్తం నకిలీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి మెయిల్ చేశారు. ఆ తర్వాత నమ్మబలికిన నిందితులు మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో ముంబయి డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులో యాదవ్‌కు అప్పగించాలని చెప్పడంతో పూర్తిగా నమ్మి నగదు అందజేశారు. ఈ మొత్తం తీసుకున్న తర్వాత ఇద్దరు నిందితుల మొబైల్ ఫోన్లు స్విచ్‌ఆఫ్ అయ్యాయి. ఈ మేరకు బాధితులు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇలా ఢిల్లీలో కూడా ఒకరిని మోసం చేశారు. నిందితులు ఇద్దరిపై కర్ణాటక, ఢిల్లీ, ముంబయిలో దాదాపు 16 కేసులు నమోదయ్యాయి. నిందితులు నకిలీ సర్ట్ఫికెట్లతో ఒక హాస్పిటల్‌ను ఢిల్లీలో నడుపుతున్నట్లు నమ్మిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చిత్రం..నకిలీ డాక్యుమెంట్ల తయారీకి నిందితులు ఉపయోగించిన స్టాంపులతో పాటు
వారి స్మార్ట్ ఫోన్లను మీడియా ముందు ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులు