క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మనె్నల్లి ఆశీర్వాదం (52)కు నాంపల్లి మొదటి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. యూసఫ్‌గూడ బిజెఆర్ నగర్‌కు చెందిన నిందితుడు ఆశీర్వాదం 15 ఏళ్ల మైనర్ బాలిక నగ్న ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. ఈ సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తానని, వీడియో, ఫోటోలను ఇతరులకు పంపిస్తానని బాలికను బెదిరించాడు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకటరెడ్డి కేసు త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు అందజేశారు. ఈ కేసులో పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.