క్రైమ్/లీగల్

భూపత్రాల నుంచి వేలిముద్రల డౌన్‌లోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌సైట్ లోని భూ పత్రాల సర్టిఫైడ్ ల్యాండ్ కాపీల నుంచి వేలిముద్రలు డౌన్‌లోడ్ చేసి తద్వారా ఓడా ఫోన్ సిమ్ కార్డులు వేల సంఖ్యలో యాక్టివేట్ చేసిన నిందితుడిని ఐబి, కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ ఒక మొబైల్ కంపెనీ ప్రీ పెయిడ్ కనెక్షన్ల డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తూ ఇలా అక్రమాలకు పాల్పడ్డాడు. నిందితుడిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రిజిష్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ నుంచి సర్టిఫైడ్ డాక్యుమెంట్ల ద్వారా వేలిముద్రలను డౌన్‌లోడ్ చేసుకుని ఆ వేలిముద్రల ద్వారా సిమ్ కార్డులను పెద్ద ఎత్తున యాక్టివేట్ చేశాడు. సుమారు రూ.4 వేల నుంచి ఆరు వేల సిమ్‌లు ఉంటాయని ప్రాధమిక అంచనా. ఇలా భారీగా సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి వాటిని అసాంఘిక శక్తులకు, లేదా ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారికి అందజేశారా..? లేక మరెవరికైనా సరఫరా చేశారా..? అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే నిందితుడు మాత్రం తన టార్గెట్ పూర్తి చేసుకునేందుకే ఇలా సిమ్ కార్డులు యాక్టివేట్ చేశానని అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భూ పత్రాల నుంచి వేలిముద్రలను తీసుకుని సిమ్ కార్డులను తీసుకున్నారు. వీటిని యాక్టివేట్ చేసిన తర్వాత సిమ్‌కార్డు, ఆధార్, నకిలీ వేలిముద్రలను తన వద్దే ఉంచుకుని కొన్ని రోజుల తర్వాత ధ్వంసం చేస్తున్నట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఇలా బయోమెట్రిక్ వ్యవస్థలో అక్రమాలు వెల్లడి కావడంతో ఆధార్ సంస్థ అధికారులు వేరుగా విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.