క్రైమ్/లీగల్

మంత్రి అఖిలప్రియపై పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రయను అనర్హురాలిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు తిరస్కరించింది. వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అఖిలప్రియ తన తండ్రితో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారని, అఖిలప్రియకు తెలుగు దేశం ప్రభుత్వం మంత్రిపదవి కట్టబెట్టిందని కాని ఆమెకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని జి మల్లేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వి రామసుబ్రమణ్యం, జస్టిస్ ఎన్ బాలయోగితో కూడిన డివిజన్ బెంచ్ గురువారం నాడు విచారించంది. ఈ పిటిషన్‌లో స్పీకర్ సకాలంలో స్పందించనందుకు ఆయన్ను కూడా అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఆయితే ఒకే పిటిషన్ ద్వారా రెండు రాజ్యంగ వ్యవస్థలలో భాగాలైన ఇద్దరిని అనర్హుల్ని చేయమని పిటిషనర్ ఎలా కోరుతారని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ తీరు అనుమానాస్పదంగా, సందేహాస్పదంగా ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. నిర్ణీత కాలవ్యవధిలో తగిన నిర్ణయం తీసుకోకుంటే స్పీకర్ అనర్హులు అవుతారని రాజ్యంగంలో ఎక్కడా లేదని కోర్టు వ్యాఖ్యానించింది.